Rythu Bandhu Scheme : రైతు బంధు పథకం పై కీలక మార్పులు .. వీరు మాత్రమే అర్హులు..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Rythu Bandhu Scheme : రైతు బంధు పథకం పై కీలక మార్పులు .. వీరు మాత్రమే అర్హులు..?

Rythu Bandhu Scheme : తెలంగాణ కొత్త ప్రభుత్వం రైతుబంధు పథకంలో కీలక మార్పులు చేయనున్నట్లు తెలుస్తుంది. దీనిపై ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. రైతు బంధు సాయానికి పరిమితులు విధించాలని నిర్ణయించింది. ఈ పథకం ఎవరికి వర్తింపచేయాలనే దానిపైన మార్గదర్శకాలు సిద్ధమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఐదు ఎకరాల లోపు ఉన్నవారు 90 శాతం మంది రైతులు ఉన్నారు. ఎకరం లోపు రైతులు 22.5 లక్షల మంది ఉన్నట్లు తేల్చారు. దీంతో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వం […]

 Authored By aruna | The Telugu News | Updated on :18 December 2023,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Rythu Bandhu Scheme : రైతు బంధు పథకం పై కీలక మార్పులు .. వీరు మాత్రమే అర్హులు..?

Rythu Bandhu Scheme : తెలంగాణ కొత్త ప్రభుత్వం రైతుబంధు పథకంలో కీలక మార్పులు చేయనున్నట్లు తెలుస్తుంది. దీనిపై ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. రైతు బంధు సాయానికి పరిమితులు విధించాలని నిర్ణయించింది. ఈ పథకం ఎవరికి వర్తింపచేయాలనే దానిపైన మార్గదర్శకాలు సిద్ధమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఐదు ఎకరాల లోపు ఉన్నవారు 90 శాతం మంది రైతులు ఉన్నారు. ఎకరం లోపు రైతులు 22.5 లక్షల మంది ఉన్నట్లు తేల్చారు. దీంతో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వం రైతుబంధు పథకం పై పునఃసమీక్షిస్తుంది. ఈ యాసంగి సీజన్ వరకు గతంలో మాదిరిగానే ఎలాంటి పరిమితులు లేకుండా రైతు బంధు పంపిణీ చేసి వచ్చే వానాకాలం నుంచి 10 ఎకరాల పరిమితి తో రైతు భరోసా పేరిట నగదు పంపిణీ చేసేలా మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్లు సమాచారం. పదికి మించి ఎన్ని ఎకరాలు ఉన్న పది ఎకరాలకు మాత్రమే రైతు భరోసా ఇవ్వనున్నట్లు సమాచారం.

అంటే ఒక రైతుకు 15 ఎకరాలు ఉంటే పది ఎకరాలకే రైతు భరోసా వస్తుంది. మిగతా 5 ఎకరాలకు రాదు. అలాగే ఇప్పటిదాకా ఎకరానికి రూ. 5000 చొప్పున ఏడాదికి రూ. 10,000 పంపిణీ చేస్తుండగా వచ్చే సీజన్ నుంచి ఒక పంటకు ఎకరానికి రూ. 7500 చొప్పున ఏడాదికి రూ. 15,000 చొప్పున పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రైతు భరోసా పథకానికి పరిమితులు విధించిన లబ్ధిదారుల సంఖ్య ఏమాత్రం తగ్గదు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70 లక్షల మంది పట్టాదారులు ఉండగా వీరందరికీ రైతు భరోసా అందుతుంది. రాష్ట్రంలో పది ఎకరాలనుంచి 54 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులు 1.15 లక్షల మంది ఉన్నారు. వీరి పేరిట 12.5 లక్షల ఎకరాల భూమి ఉంది. అయితే పది ఎకరాల పరిమితి పెడితే 1.15 లక్షల మందికి 11.5 ఎకరాలకు పెట్టుబడి సాయం అందించాల్సి వస్తుంది. అయితే కట్ ఆఫ్ విధించడం ద్వారా కేవలం లక్ష ఎకరాలకు రైతు భరోసా ఆగిపోతుంది. ఎకరానికి రూ. 15000 చొప్పున ఏడాదికి 150 కోట్లు తగ్గుతుంది.

కానీ ఇప్పటివరకు ఉన్న పెట్టుబడి సాయాన్ని పదివేల నుంచి 15 వేలకు పెంచడంతో 50% ఆర్థిక భారం పెరుగుతుంది. లక్ష ఎకరాలకు మినహాయించి 1.49 కోట్ల ఎకరాలకు రైతు భరోసా పంపిణీ చేయాలంటే ఏడాదికి రూ. 22,350 కోట్లు అవుతుంది. ఇప్పటివరకు రైతుబంధు పథకానికి ఏడాదికి అవుతున్న ఖర్చు రూ. 15000 కోట్లు అంటే రూ. 7350 కోట్ల మీద ఆర్థిక భారం పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి వ్యవసాయ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇకపోతే రైతు బంధు పథకాన్ని 2018 సంవత్సరంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిన సంగతి తెలిసిందే. తొలుత ఎకరానికి రూ. 4000 చొప్పున ఎకరానికి 8వేలు ఇచ్చారు. రెండు సీజన్లు గడిచిన తర్వాత ఆ మొత్తాన్ని 5 వేలకు పెంచి ఏడాదికి ఎకరానికి రూ. 10,000 చొప్పున ఇచ్చారు. అయితే రైతు బంధు పంపిణీపై అప్పటి ప్రభుత్వం ఎలాంటి కటాఫ్ విధించలేదు. ఇప్పుడు రైతు భరోసా కింద దాన్ని పది ఎకరాలకు పరిమితం చేయాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్టు సమాచారం.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది