Kichannagari Lakshma Reddy : మల్కాజిగిరిపై కేఎల్ఆర్ దృష్టి..ముగ్గురు మంత్రులపై ఫోకస్ !
Kichannagari Lakshma Reddy : అర్జునుడికి చెట్టు, కొమ్మ, పక్షి కాదు… దాని కన్నులోని కనుగ్రుడ్డు మాత్రమే కనిపించిందట! కాంగ్రెస్ పార్టీ కీలక నేత కేఎల్ఆర్ ఇప్పుడు అదే సూత్రం పాటిస్తున్నారు! కిచ్చన్నగారి లక్ష్మారె్డ్డిగా మేడ్చల్, రంగారెడ్డి ప్రాంత వాసులకి అత్యంత సుపరిచితులైన మన డైనమిక్ లీడర్… హై కమాండ్ ఆదేశాలతో ఎలక్షన్ మోడ్ లోకి వెళ్లిపోయారు. ఏక కాలంలో కేసీఆర్ క్యాబినేట్ లోని ముగ్గురు మంత్రుల నియోజక వర్గాలపై గురి పెట్టారు. ఏదో ఒక కాన్ స్టిట్యూయెన్సీ నుంచీ ఆయన బరిలోకి దిగుతారని కాంగ్రెస్ లో ప్రచారం జరుగుతోంది.
కాంగ్రెస్ నుంచీ బీఆర్ఎస్ లోకి వలస వెళ్లిన సబితా ఇంద్రా రెడ్డి ప్రస్తుతం మహేశ్వరం ప్రాంతంలో బలంగా ఉన్నారు. ఆమె తీరుపై, లోటుపాట్లపై కేఎల్ఆర్ దృష్టి సారించారు. మంత్రిగా కూడా అధికారం వెలగబెడుతోన్న బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు చేసిందేమీ లేదని జనానికి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే, మన కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి మరో మంత్రి మల్లారెడ్డిపై కూడా ఫోకస్ చేస్తున్నారు. మల్కాజ్ గిరి నుంచీ ప్రాతినిధ్యం వహిస్తోన్న ఆయన రేయింబవళ్లూ కేసీఆర్, కేటీఆర్ భజనలో తరిస్తుంటారు. జనానికి చేసిన మేలు మాత్రం అంతంతమాత్రమే! రానున్న ఎన్నికల్లో కేఎల్ఆర్ ను మల్కాజ్ గిరి నుంచీ కూడా అధిష్టానం బరిలో దింపవచ్చట!
ఇక తాండూరులో పట్నం మహేందర్ రెడ్డిని కూడా కిచ్చన్నగారి లక్ష్మారెట్టి ఢీకొట్టే అవకాశం ఉంది. కేసీఆర్ టీమ్ లో బలమైన నేతగా ఉన్న మహేందర్ రెడ్డిని ఎదుర్కోవటం ఇతరులకి అంత ఈజీ కాదు. కానీ, స్థానికంగా మంచి పట్టు ఉన్న కేఎల్ఆర్ అయితే మహేందర్ రెడ్డిని ధీటుగా ఎదుర్కుంటాడని హై కమాండ్ ఆలోచన! అదే నిర్ణారణ అయితే తాండూరులో బీఆర్ఎస్ కు టఫ్ ఫైట్ తప్పదు. కేఎల్ఆర్ రూపంలో కాంగ్రెస్ కు అసెంబ్లీలో ఒక సీటు కన్ ఫర్మ్ అంటున్నారు కార్యకర్తలు!