Konda Murali : కొండా మురళి వివరణకు క్షమశిక్షణ సంతృప్తి చెందిందా..?
ప్రధానాంశాలు:
Konda Murali : కొండా మురళి వివరణకు క్షమశిక్షణ సంతృప్తి చెందిందా..?
Konda Murali : హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో మల్లు రవి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా కమిటీ సమావేశం జరగగా, ఈ మీటింగ్ వరంగల్ జిల్లాకు సంబంధించిన వివాదాస్పద అంశంపై చర్చించేందుకు ఈ సమావేశం నిర్వహించబడింది. ఈ సందర్భంగా, వరంగల్ ఇష్యూకు సంబంధించి వివరణ ఇవ్వడానికి కొండా మురళి గాంధీ భవన్‌కు చేరుకున్నారు.

Konda Murali : కొండా మురళి వివరణకు క్షమశిక్షణ సంతృప్తి చెందిందా..?
Konda Murali మురళి వివరణ..
కొండా మురళి తన రాకపై కొందరు నాయకులతో తీవ్రంగా వాదించినట్లు సమాచారం. “క్రమశిక్షణా కమిటీ సమావేశానికి ముందే నేను వచ్చాను. గాంధీ భవన్‌కు రావొద్దా?” అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. వరంగల్ విషయంలో ఆయనపై వచ్చిన ఆరోపణల గురించి సమావేశంలో వివరణ ఇచ్చేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారు. ఈ సమావేశంలో ఆయన వివరణను కమిటీ సభ్యులు విశ్లేషించనున్నారు.
ఈ సమావేశంలో చర్చించిన అంశాలు మరియు తీసుకున్న నిర్ణయాలు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమైన మార్పులకు దారితీయవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సమావేశం గాంధీ భవన్‌లో జరిగిన తాజా పరిణామాలను దృష్టిలో ఉంచుకుని, పార్టీలో ఐక్యత మరియు క్రమశిక్షణను బలోపేతం చేసే దిశగా ఒక అడుగుగా చూడవచ్చు. అయితే తాను ఇచ్చిన వివరణతో క్రమశిక్షణ కమిటీ సంతృప్తి చెందింది అని కొండా మురళి అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన మాటను జవదాటను, పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాను. రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేయాలన్నదే మా అందరి కోరిక అని కొండా మురళి స్పష్టం చేశారు.