Kavitha : కవిత విషయంలో కేసీఆర్ సీరియస్.. ఆమెని ఒంటరి చేయబోతున్నారా ?
ప్రధానాంశాలు:
Kavitha : కవిత విషయంలో కేసీఆర్ సీరియస్.. ఆమెని ఒంటరి చేయబోతున్నారా ?
Kavitha : కేసీఆర్ KCR కూతురు కవిత లేఖ ఒకటి ఇటీవల బయటకు రావడంతో దీనిపై పెద్ద చర్చే నడిచింది. KCR కేసిఆర్ తో భేటీ అయిన తర్వాత పార్టీ శ్రేణులకు ముఖ్య నాయకులకు అంతర్గతంగా కవిత వ్యవహారం పైన ఎవరు స్పందించవద్దని కేటీఆర్ సమాచారం ఇచ్చారు. కేసీఆర్‌తో భేటీలో కవిత రాసిన లేఖ, అమెరికా పర్యటన నుంచి వచ్చిన తర్వాత చేసిన వ్యాఖ్యలు తదితర అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం.

Kavitha : కవిత విషయంలో కేసీఆర్ సీరియస్.. ఆమెని ఒంటరి చేయబోతున్నారా ?
Kavitha : కవిత ఇలా బుక్ అయింది..
పార్టీలో అంతర్గతంగా చర్చించవలసిన అంశాలు ఇప్పటికే బహిర్గతం అయ్యాయని, జరిగిన పరిణామాలపై ఎవరు బహిరంగంగా ఎటువంటి వ్యాఖ్యలు చేయకూడదని, టీవీ చర్చలలో మాట్లాడకూడదని ఆయన కీలక ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక కెసిఆర్ తో సమావేశమైన తర్వాత కేటీఆర్ ఇదే విషయాన్ని పార్టీ ముఖ్య నాయకులకు అంతర్గతంగా సమాచారం అందించి కవిత వ్యాఖ్యల పైన స్పందించవద్దని అన్నట్టు తెలుస్తుంది.
ఇక ఈ తాజా నిర్ణయంతో కవితను కెసిఆర్ మాట్లాడడానికి పిలిచే అవకాశం లేదని, ఆమె వేదన వర్ణనాతీతం అంటున్నారు. ఆమె ఒంటరి కానుందనే టాక్ కూడా వినిపిస్తుంది. ఇక కవిత ఒంటరి పోరాటం చేయాల్సిందే నిన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో కవిత త్వరలో వేరే పార్టీ పెట్టనుందనే చర్చ కూడా నడుస్తుంది.