Mallareddy : మాట మార్చిన మల్లన్న.. నేను ఆ మాట అనలేదంటూ క్లారిటీ..!
ప్రధానాంశాలు:
రాజకీయాల అంశంలో మల్లారెడ్డి యూటర్న్..
Mallareddy : మాట మార్చిన మల్లన్న.. నేను ఆ మాట అనలేదంటూ క్లారిటీ
Mallareddy : మాజీ మంత్రి మల్లారెడ్డి తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వస్తున్న వార్తలపై స్పష్టత ఇచ్చారు. తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు మాత్రమే తాను సమాధానం ఇచ్చానని, తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఆయన వివరించారు. దేశవ్యాప్తంగా విద్యా సంస్థలను విస్తరిస్తానని చెప్పాను తప్ప, రాజకీయాలను వదిలేస్తానని ఎప్పుడూ అనలేదని ఆయన పేర్కొన్నారు.

Mallareddy : మాట మార్చిన మల్లన్న.. నేను ఆ మాట అనలేదంటూ క్లారిటీ..!
Mallareddy : రాజకీయాల నుండి నేను దూరం అవ్వడం ఏంటి..? ఆ మాట అన్నది ఎవరు..? మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు
జపాన్‌లో రిటైర్‌మెంట్ ఉండదని, అదేవిధంగా రాజకీయాల్లో కూడా రిటైర్‌మెంట్ ఉండదని మల్లారెడ్డి గట్టిగా చెప్పారు. తన ప్రకటనలను వక్రీకరించారని, తాను రాజకీయాల్లో క్రియాశీలకంగానే ఉంటానని ఆయన పునరుద్ఘాటించారు. రాజకీయాలను వదిలేయడం అనేది తన ఆలోచనలలో లేదని, భవిష్యత్తులో కూడా ప్రజలకు సేవ చేస్తూనే ఉంటానని ఆయన తెలిపారు.
మల్లారెడ్డి వ్యాఖ్యలతో రాజకీయాలకు దూరంగా ఉంటారనే ఊహాగానాలకు తెరపడింది. ఆయన విద్యా వ్యాపారాలపై దృష్టి పెడుతున్నారని, అందువల్ల రాజకీయాలకు తక్కువ ప్రాధాన్యత ఇస్తారని భావించిన వారికి ఆయన తాజా ప్రకటన ఒక సమాధానం ఇచ్చింది. తాను తన వ్యాపారాలను, రాజకీయాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతానని ఆయన చెప్పారు.