Sridhar Babu VS KTR : ధరణి పోర్టల్ అవినీతిపై అసెంబ్లీలో కేటీఆర్‌ను నిలదీసిన కొత్త ఐటీ మంత్రి శ్రీధర్ బాబు
ప్రధానాంశాలు:
అసెంబ్లీలో ధరణిపై మాట్లాడిన మంత్రి శ్రీధర్ బాబు
కేటీఆర్ పై ఫైర్
ధరణి వల్ల చాలామంది రైతులకు అన్యాయం జరిగింది
Sridhar Babu VS KTR : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వారం దాటింది. సీఎం రేవంత్ పాలనలో దూసుకుపోతున్నారు. చాలా కొత్తగా, పాత ప్రభుత్వం కంటే కూడా బెటర్ గా రేవంత్ రెడ్డి పాలన చేస్తున్నారు. ఇటీవలే కొత్త ఎమ్మెల్యేలు అందరూ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత కొత్త స్పీకర్ ను ఎన్నుకున్నారు. ఇప్పుడు తాజాగా అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతున్నాయి. ఈనేపథ్యంలో కేటీఆర్ పై కొత్త మంత్రులు ఫైర్ అవుతున్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతిని బయటపెడుతున్నారు. తాజాగా కొత్త ఐటీ మంత్రి శ్రీధర్ బాబు.. ధరణి విషయంలో కేటీఆర్ పై ఫైర్ అయ్యారు. ధరణి మొత్తం తప్పుల తడకే అని మండిపడ్డారు. ధరణికి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం పాలసీ అంశాని చెప్పినప్పుడు ఏమన్నారంటే ఇది సర్వరోగ నివారణి అన్నారు. అన్ని రకాల భూముల సమస్యలను తీర్చుతుందన్నారు. కానీ.. ధరణికి సంబంధించి ఎన్నో సమస్యలు వస్తున్నాయని భూమి యజమానులు వాపోతున్నారన్నారు.
ధరణికి సంబంధించి చాలా సమస్యలు పరిష్కారం కాలేదు. దీనికి మార్గం లేదు. అధికారుల తప్పిదాలతో భూములు అమ్ముతున్న యాజమానులు పోర్టల్ లో నమోదు చేయబడినా.. వాటిని కొనుగోలు చేసిన వాళ్ల పేర్లు లేవు. చాలా ఏళ్ల కింద కొనుక్కొని సాగు చేసుకుంటున్న వాళ్ల పేర్లు పోర్టల్ లో కనిపించడం లేదు. ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారు. ధరణి ఆన్ లైన్ లోకి వచ్చిన తర్వాత 4 లక్షల మంది రైతులకు హక్కు పత్రాలు లేవు. మీసేవలో ఆ రైతులు దరఖాస్తు చేసుకున్నా ఇప్పటికీ అవి పెండింగ్ లో ఉన్నాయి. లాండ్ సీలింగ్ యాక్ట్ లో భూములు పోయినా ఈ రోజు కూడా ధరణి పోర్టల్ లో వాళ్ల పేర్లు కనిపిస్తున్నాయి. దీంతో సాగు చేసుకుంటున్న వాళ్లకు ఏం చేయాలో అర్థం కావడం లేదని మంత్రి అన్నారు.
Sridhar Babu VS KTR : భూమి కనిపించక నలుగురు రైతులు ఆత్మహత్య
ధరణిలో తమ భూములు కనిపించక నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇది కేవలం బయటికి వచ్చినవే.. వెలుగులోకి రాని ఆత్మహత్యలు, విషాదాలు చాలా ఉన్నాయని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. భూములు అమ్మిన పాత రైతుల పేరు మీద కొత్త పాస్ బుక్స్ జారీ అయ్యాయి. దీన్ని ఆధారంగా చేసుకొని తిరిగి వేరే వాళ్లకు అమ్మేస్తున్నారు. ఇలాంటి తప్పుల తడకగా ఉన్న ధరణి పోర్టల్ మనకు అవసరమా అని మంత్రి మండిపడ్డారు.