MLC Kavitha : కేసీఆర్ మంచోడు – నేను రౌడీ.. పింక్ బుక్ బరాబర్ పెడతాం : ఎమ్మెల్సీ కవిత
ప్రధానాంశాలు:
MLC Kavitha : కేసీఆర్ మంచోడు - నేను రౌడీ.. పింక్ బుక్ బరాబర్ పెడతాం : ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha : తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. బాన్సువాడలో బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశంలో పాల్గొన్న కవిత.. “నేను కొంచెం రౌడీ టైప్” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ కార్యకర్తలను బెదిరిస్తున్న వారి పేర్లను ‘పింక్ బుక్’లో బరాబర్ రాసుకుంటామని హెచ్చరించారు. బెదిరింపులు చేసేవారిని వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకులు ఫోన్ కాల్స్ ద్వారా భయపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, వారిపై కేసులు పెట్టించి పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లడం సాధారణమైందని మండిపడ్డారు.

MLC Kavitha : కేసీఆర్ మంచోడు – నేను రౌడీ.. పింక్ బుక్ బరాబర్ పెడతాం : ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha పింక్ బుక్ బరాబర్ పెడతాం అంటూ కాంగ్రెస్ నేతలకు కవిత వార్నింగ్
“మాట తప్పడం, మడమ తిప్పడం కాంగ్రెస్ నైజం” అన్నారు. గతంలో తెలంగాణ ఇవ్వబోతున్నామంటూ పదేళ్లపాటు ప్రజలను అబద్ధాలు చెప్పి మోసం చేశారని, వేలాది మంది యువతుల బలిదానాలకు కాంగ్రెస్ పార్టీనే కారణమని ఆమె ఆరోపించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. ఏడాదిన్నరలోనే ఇంత వ్యతిరేకత మూటగట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి నోబెల్ బహుమతి ఇవ్వాలి అంటూ వ్యంగ్యంగా స్పందించారు…
తెలంగాణ రాష్ట్ర సాధనలో బీఆర్ఎస్ పాత్రను ప్రస్తావించిన కవిత, ఇది అద్భుతమైన చరిత్ర అని గర్వంగా పేర్కొన్నారు. కేసీఆర్ నాయకత్వంలో హింసలేని ప్రజాస్వామ్య పోరాటం ద్వారా రాష్ట్రాన్ని సాధించామన్నారు. కేంద్ర మంత్రి పదవిని కూడా వదిలేసిన గొప్పతనం కేసీఆర్‌దేనని ఆమె గుర్తుచేశారు. రైతులకు పథకాలు, సాగునీటి పన్ను మాఫీ, చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేసిన అభ్యుదయ చరిత్రను బీఆర్ఎస్ సృష్టించిందని తెలిపారు. “తెలంగాణ కోసం పోరాడినవారు వీరులే, వాళ్లు మాత్రమే లక్ష్యం చేరే వరకు వెనక్కి తగ్గరు. కేసీఆర్ వంటి నాయకుడితోనే అది సాధ్యమైంది” అంటూ కవిత ప్రసంగాన్ని ముగించారు.