Electricity Charges : విద్యుత్ ఛార్జీల పెంపు పై సీఎండీ కీలక అప్‌డేట్..!
ప్రధానాంశాలు:
Electricity Charges : విద్యుత్ ఛార్జీల పెంపు పై సీఎండీ కీలక అప్‌డేట్..!
Electricity Charges : మార్చి నెలలోనే ఎండలు దంచి కొడుతున్నాయి. బయట ఎండలు, వేడిగాలులు.. ఇంట్లో ఉక్కపోతతో జనాలు ఇప్పుడే ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రాష్ట్రంలో విద్యుత్ వాడకం కూడా గరిష్ఠానికి చేరుకునే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో.. గత కొన్ని రోజులుగా తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపు విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వార్తలపై టీజీఎస్పీడీసీఎల్ స్పందిస్తూ.. క్లారిటీ ఇచ్చింది.

Electricity Charges : విద్యుత్ ఛార్జీల పెంపు పై సీఎండీ కీలక అప్‌డేట్..!
Electricity Charges పెంచే ఛాన్స్ లేదు..
ఈ మేరకు TGSPDCL సీఎండీ ముషారఫ్ ఫారూఖీ మాట్లాడుతూ.. ఈ ఏడాది విద్యుత్ ఛార్జీల పెంపునకు ఎటువంటి ప్రతిపాదనలు చేయడం లేదని ముషారఫ్ క్లారిటీ ఇచ్చారు. దీంతో.. సామాన్య ప్రజలు కాస్త ఊపిరిపీల్చుకోనున్నారు.టీజీపీఎస్సీ డీసీఎల్ ఆదాయ ఆవశ్యకత, రిటైల్ సరఫరా ప్రతిపాదనలపై ఈ విచారణ జరగ్గా.. సీఎండీ, జేఎండీ శ్రీనివాస్ లు హాజరైనట్లు తెలుస్తుంది
ఎండా కాలం ఎండలు మండిపోతున్న నేపథ్యంలో రోజంతా ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు నడవడం సహజం.. ఈ క్రమంలో విద్యుత్ ఛార్జీలు తడిసి మోపెడవుతుంటాయి. మరి ఇలాంటి సమయంలో విద్యుత్ ఛార్జీలు పెంచితే ఇంకేమైనా ఉందా..? బయట భానుడి భగభగలకంటే.. కరెంట్ బిల్లులే మండిపోతాయని సామాన్యులు బెంబేలెత్తిపోయారు. అయితే.. విద్యుత్ సంస్థలు క్లారిటీ ఇవ్వటంతో.. ఛార్జీల పెంపు లేనట్టేనని స్పష్టమైపోయింది. దీంతో.. సామాన్యులకి కాస్త ఉపశమనం పొందినట్టయింది.