Namasthe Telangana : జర్నలిస్టుల సంక్షేమమే మా తాపత్రయం.. ఎవరిపై మాకు శతృత్వం లేదు..!
ప్రధానాంశాలు:
Namasthe Telangana : జర్నలిస్టుల సంక్షేమమే మా తాపత్రయం.. ఎవరిపై మాకు శతృత్వం లేదు..!
Namasthe Telangana : తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమం కోసమే మేము ఎల్లప్పుడూ తాపత్రయపడ్డాం.. పడుతూనే ఉంటాం. అందులో భాగంగానే నమస్తే తెలంగాణలో ఉద్యోగుల కుదింపు లాంటి వార్తను రాశాం తప్పితే మాకు ఎవరి మీద కోపం కానీ, శతృత్వం కానీ లేదు. మాకు అలాంటి ఉద్దేశం కూడా లేదు. ఎవరి మీద, ఏ సంస్థ మీద తప్పుడు కథనాలు రాయడం అనేది మా ఉద్దేశం కాదు. జర్నలిస్టులు బాగుండాలని, సంస్థల్లో ఉద్యోగులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పని చేసుకోవాలనేదే మా తాపత్రయం.
నమస్తే తెలంగాణ పత్రికలో ఉద్యోగులను తీసేస్తున్నారని పలు పత్రికల్లో, సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను ఆధారంగా చేసుకొని మాత్రమే మేము మా వెబ్ సైట్ లో కథనాన్ని రాశాం. అంతే తప్పితే మాకు నమస్తే తెలంగాణ పత్రికపై కానీ, ఆ సంస్థ ఉద్యోగులపై కానీ ఎలాంటి పగ, ప్రతీకారాలు తీర్చుకునే శతృత్వం లేదు. అలాంటి అవసరం కూడా మాకు లేదు. ఆ వార్త రాసిన రెండు మూడు రోజులకే ఉద్యోగుల ఉద్వాసన అనేది అబద్ధం అని తెలిసి వెంటనే ఆ కథనాన్ని ఉపసంహరించుకున్నాం.
మా వెబ్ సైట్ నుంచి దాన్ని అప్పుడే తొలగించాం. అయినా కూడా మీకు మా కథనం వల్ల అగౌరవం అనిపిస్తే మా వెబ్ సైట్ తరుపున నమస్తే తెలంగాణ యాజమాన్యానికి క్షమాపణ చెబుతున్నాం. మరోసారి ఇలాంటి కథనాలు రిపీట్ కాకుండా జాగ్రత్త పడతాం. ఇప్పుడే కాదు ఇంకా ఎప్పుడైనా మేము జర్నలిస్టుల తరుపున పోరాడుతాం. వాళ్ల సంక్షేమం కోసం కృషి చేస్తాం. ఓ పత్రికకు పంపించిన లీగల్ నోటీసులో మా వెబ్ సైట్ పేరును కూడా చేర్చారు కాబట్టి మేము మా వెబ్ సైట్ ద్వారానే ఆ వార్తకు సంబంధించిన వివరణ ఇస్తున్నాం.