New Ration Cards : కొత్త రేషన్ కార్డ్ తీసుకునే వారు ఇలా చేయండి.. లేఅంటే కార్డ్ రావడం కష్టం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

New Ration Cards : కొత్త రేషన్ కార్డ్ తీసుకునే వారు ఇలా చేయండి.. లేఅంటే కార్డ్ రావడం కష్టం..!

New Ration Cards : తెలంగాణాలో కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వ వారు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో రేషన్ కార్డ్ విషయంలో చాలా ఫోకస్ గా ఉన్నారు. ఆల్రెడీ రేషన్ ఉన్న వారిలో ఫేక్ రేషన్ కార్డులను తొలగిస్తూ కొత్త రేషన్ కార్డ్ తీసుకునే వారికి సరైన విధివిధానాలను సూచిస్తున్నారు. కొత్త రేషన్ కార్డ్ కావాలంటే కొన్ని షరతులు ఉన్నాయి వాటిని ఫాలో అయితేనే లేదంటే రేషన్ కార్డ్ పొందే అవకాశం […]

 Authored By ramu | The Telugu News | Updated on :19 October 2024,8:00 am

ప్రధానాంశాలు:

  •  New Ration Cards : కొత్త రేషన్ కార్డ్ తీసుకునే వారు ఇలా చేయండి.. లేఅంటే కార్డ్ రావడం కష్టం..!

New Ration Cards : తెలంగాణాలో కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వ వారు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో రేషన్ కార్డ్ విషయంలో చాలా ఫోకస్ గా ఉన్నారు. ఆల్రెడీ రేషన్ ఉన్న వారిలో ఫేక్ రేషన్ కార్డులను తొలగిస్తూ కొత్త రేషన్ కార్డ్ తీసుకునే వారికి సరైన విధివిధానాలను సూచిస్తున్నారు. కొత్త రేషన్ కార్డ్ కావాలంటే కొన్ని షరతులు ఉన్నాయి వాటిని ఫాలో అయితేనే లేదంటే రేషన్ కార్డ్ పొందే అవకాశం లేదు. ముఖ్యంగా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఫ్యామిలీ డిజిటల్ సర్వేలో భాగంగా ఎమ్మార్వోలు ప్రతి ఇంటికి వెళ్లి ఫ్యామిలీ వివరాలను తీసుకుంటున్నారు. ఆధార్ కార్డ్ లేదా ఇతర గుర్తింపు కార్డ్ ద్వారా వివరాలను సేకరిస్తున్నారు. ఫ్యామిలీతో పాటు అందరు డిజిటల్ ఫోటోలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా రిలీజ్ చేసిన డిజిటల్ కార్డ్ సర్వే ద్వారానే రేషన్ ఇవాల్సి ఉంటుంది. అంతేకాదు ప్రభుత్వ పథకాలు పొందాలన్నా కూడా ఈ కార్డ్ కంపల్సరీ అవుతుంది. నల్గొండ జిల్లా కట్టంగూరు మండలంలో ఎమ్మార్వో ప్రసాద్ ఈ వివరాలు చెప్పారు.

New Ration Cards ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డిజిటల్ కార్డ్ సర్వే..

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డిజిటల్ కార్డ్ ల సర్వే ఆధారంగానే కట్టంగూర్ మండల పరిధిలో రామచంద్రాపుర గ్రామంలో డిజిటల్ సర్వే నిర్వహిస్తున్నట్టు చెప్పారు. కట్టంగూర్ మండల సంబందించిన ఎంపీడీఓ, ఎమ్మార్వో రెండు బృందాలుగా చేసుకుని రామచంద్రాపూర్‌లో ఒక ఇల్లు లేదా ఫ్యామిలీ కూడా నష్టపోకుండా డిజిటల్ సర్వే చేస్తున్నారు. ఈ ప్రక్రియ అక్టోబరు 3 నుంచి 7వ తేదీలోగా డిజిటల్ సర్వే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది.

New Ration Cards కొత్త రేషన్ కార్డ్ తీసుకునే వారు ఇలా చేయండి లేఅంటే కార్డ్ రావడం కష్టం

New Ration Cards : కొత్త రేషన్ కార్డ్ తీసుకునే వారు ఇలా చేయండి.. లేఅంటే కార్డ్ రావడం కష్టం..!

ఇక అధికారులు ఇంటికి వస్తే ఆధార్ కార్డ్ లేదా ఎంతమంది సభ్యులు ఉంటే వారి గుర్తింపు కార్డులు అధికారులకు చూపించాలి. వివరాలు పూర్తి చేశాక అభ్యర్ధి సంతకం చేయాలి. ఆ తర్వాత సభ్యులంతా డిజిటల్ గ్రూప్ ఫోటో గ్రాఫ్ తీసుకోవాలి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది