New Year Uppal : న్యూ ఇయర్ లిక్కర్ పార్టీ.. కంపు కొడుతున్న ఉప్పల్ మున్సిపల్ స్టేడియం
ప్రధానాంశాలు:
New Year Uppal : న్యూ ఇయర్ లిక్కర్ పార్టీ.. కంపు కొడుతున్న ఉప్పల్ మున్సిపల్ స్టేడియం
New Year Uppal : ప్రపంచం New Year 2025 ప్రారంభానికి గొప్ప స్వాగతం పలికింది. ఈ క్రమంలో రాష్ట్రం మొత్తం సెలబ్రేషన్ మోడ్‌లోకి వెళ్లింది. నూతన సంవత్సరానికి హైదరాబాద్ నగరవాసులు సైతం హుషారుగా స్వాగతం పలికారు. సరదా పాటలు మరియు నృత్యాలతో రాత్రంతా హుషారుగా గడిపారు. మొయినాబాద్, శంకర్‌పల్లి, మేడ్చల్, ఘట్‌కేసర్, భోంగీర్, శంషాబాద్‌లోని ఫాంహౌస్‌లు, రిసార్టులు పూర్తిగా బుక్ అయ్యాయి. Liquor Party మద్యం యథేచ్ఛగా ప్రవహించింది. ఉప్పల్ మున్సిపల్ గ్రౌండ్ Uppal Municipal Stadium సైతం న్యూ ఇయర్‌కు ఆహ్వానం పలికే వేడుకల్లో ఒకటిగా నిలిచింది.
ఈ గ్రౌండ్‌లో లిక్కర్ పార్టీకి సైతం అధికారులు అనుమతి ఇవ్వడంతో అంతా హుషారుగా పాల్గొని సరదా సంతోషాలను పంచుకున్నారు. అయితే ఆ పార్టీతో ఉప్పల్ మున్సిపల్ స్టేడియం చెత్త డంపింగ్ యార్డులా మారింది. ఈ స్టేడియంలో రోజూ ఉదయం స్థానికులు వాకింగ్ వస్తుంటారు. ఎప్పటిలాగే బుధవారం కూడా వాకర్స్ వచ్చి చూసే సరికి స్టేడియం మొత్తం డంపింగ్ యార్డులా దర్శనమివ్వడంతో అంతా షాకయ్యారు.
పార్టీ తర్వాత నిర్వాహకులు స్టేడియంను క్లీన్ చేయకుండా వదిలేసి పోయారు. దీంతో ఉదయం వాకింగ్ వచ్చిన కాలనీ వాసులు అటు మున్సిపల్ అధికారులు, ఇటు న్యూయర్ పార్టీ నిర్వాహకులపై ఫైర్ అయ్యారు. , New Year,
ఉప్పల్ మున్సిపల్ స్టేడియంలో లిక్కర్ పార్టీకి అనుమతి ఇచ్చిన అధికారులు
స్టేడియం మొత్తం కంపు చేసి క్లీన్ చేయకుండా వదిలేసి వెళ్లిపోయిన న్యూ ఇయర్ పార్టీ నిర్వాహకులు
ఉదయం వాకింగ్ వచ్చి చూసి షాక్ అయిన కాలనీ వాసులు
Photos and Video credit source – @tpreddyhyd pic.twitter.com/88zx1aiTUZ
— Telugu Scribe (@TeluguScribe) January 1, 2025