kalvakuntla kavitha : కవితకు సుప్రీంకోర్టులో చుక్కెదురు.. బెయిల్ నిరాకరణ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

kalvakuntla kavitha : కవితకు సుప్రీంకోర్టులో చుక్కెదురు.. బెయిల్ నిరాకరణ..!

 Authored By ramu | The Telugu News | Updated on :22 March 2024,3:30 pm

kalvakuntla kavitha  : ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవితకు సుప్రీంకోర్టులో చుక్కెదురు అయింది. ఆమె బెయిల్ కోసం పిటిషన్ వేయగా.. సుప్రీంకోర్టు నిరాకరించింది. బెయిల్ కోసం ట్రయల్ రన్ కు వెళ్లాలని ధర్మాసనం సూచించింది. ఇందుకు సంబంధించిన పిటిషన్ ను ధర్మాసనం కొట్టేసింది. రాజకీయ నేతలు అయినంత మాత్రాన ఈ కేసును విచారంచలేమని.. చట్టం అందరికీ ఒకటే అని.. ప్రస్తుతం ఈ కేసు విచారణ చేయడ కుదరదని తేల్చేసింది కోర్టు. చట్టం అందరికీ సమానమే కాబట్టి ఈ కేసు విచారణ కోసం ముందుగా ట్రయల్ కోర్టుకే వెళ్లాలని కవిత తరపు న్యాయవాదులకు కోర్టు స్పష్టం చేసింది.

అంతే కాకుండా మహిళ కాబట్టి కేసు విచారణలో జాప్యం చేయొద్దని ట్రయల్ కోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. అంతే కాకుండా పిటిషన్ లో లేవనెత్తిన అంశాలపై విచారించేందుకు కోర్టు అంగీకిరంచింది. ఇందుకోసం ఈడీకి నోటీసులు కూడా జారీ చేసింది. 6 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. రిట్ పిటిషన్ లో లేవనెత్తిన అంశాలను విజయ్ మదన్ లాల్ కేసుతో కలిపి విచారిస్తాం. కానీ కవిత మాత్రం ట్రయల్ రన్ ఎదుర్కోవాల్సిందే అంటూ ధర్మాసనం తేల్చి చెప్పింది. కాగా కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ ఈ నెల 15న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

kalvakuntla kavitha కవితకు సుప్రీంకోర్టులో చుక్కెదురు బెయిల్ నిరాకరణ

kalvakuntla kavitha : కవితకు సుప్రీంకోర్టులో చుక్కెదురు.. బెయిల్ నిరాకరణ..!

ఆమెను ఈడీ అధికారులు నేరుగా రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పర్చగా.. 7 రోజుల కస్టడీ విధించింది. అంతే కాకుండా ఈడీ కస్టడీకి కూడా అనుమతిచ్చింది. దాంతో తన అరెస్ట్ ను సవాల్ చేస్తూ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. అంతే కాకుండా తనను ఈడీ అధికారులు అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ పిటిషన్ లో తెలిపింది. కాగా రేపు ఆమెను కోర్టులో ఈడీ అధికారులు హాజరు పర్చనున్నారు. ఈ కేసులో ఇప్పట్లో బెయిల్ వచ్చే అవకాశాలు లేవని తెలుస్తోంది. కానీ ప్రస్తుతానికి ఆమెను బెయిల్ మీద విడుదల చేయించేందుకు ఆమె తరఫు న్యాయవాదులు ప్రయత్నాలు చేస్తున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది