Telangana Elections Results 2023 : ఓటమి దిశగా ఆరుగురు తెలంగాణ మంత్రులు
ప్రధానాంశాలు:
Telangana Elections Results 2023 : వెనుకంజలో తెలంగాణ మంత్రులు ఎర్రబెల్లి, అల్లోల, కొప్పుల, పువ్వాడ..!
తెలంగాణ ఎన్నికల ఫలితాలు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి , ఎర్రబెల్లి దయాకర్ రావు , కొప్పుల ఈశ్వర్ , పువ్వాడ అజయ్
Telangana Elections Results 2023 : తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ ఆధిక్యంలో దూసుకుపోతోంది. బీఆర్ఎస్ పార్టీ వెనుకంజలో ఉంది. మరోవైపు తెలంగాణ మంత్రులు చాలామంది వెనుకంజలో ఉన్నారు. నిర్మల్ జిల్లాకు చెందిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి వెనుకంజలో ఉన్నారు. అక్కడ బీజేపీ భారీ ఆధిక్యంలో ఉంది. ఇక.. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెనుకంజలో ఉన్నారు. ఆయన పాలకుర్తి నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే. అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అనుమాండ్ల యశశ్విని రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు.
కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రి కొప్పుల ఈశ్వర్ కూడా వెనుకంజలో ఉన్నారు. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి లీడ్ లో ఉన్నారు. ఖమ్మంలో పువ్వాడ అజయ్ వెనుకంజలో ఉన్నారు. ఇప్పటి వరకు జరిగిన లెక్కింపు ప్రకారం చూసుకుంటే.. కాంగ్రెస్ 64, బీఆర్ఎస్ 41, బీజేపీ 10, ఎంఐఎం 4 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ఇప్పటికే మూడు రౌండ్లు ముగిసి నాలుగో రౌండ్ కౌంటింగ్ జరుగుతోంది. మూడు రౌండ్లలోనూ తెలంగాణ మంత్రులు వెనుకంజలో ఉన్నారు. మంత్రి నిరంజన్ రెడ్డి కూడా వెనుకంజలో ఉన్నారు. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి లీడ్ లో ఉన్నారు.
ఓవర్ ఆల్ గా చూసుకుంటే కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రి గంగుల కమలాకర్, సిద్దిపేటకు చెందిన మంత్రి హరీశ్ రావు, సిరిసిల్లలో పోటీ చేసిన మంత్రి కేటీఆర్ మాత్రమే లీడ్ లో ఉన్నారు. మిగితా మంత్రులు ఎర్రబెల్లి, నిరంజన్ రెడ్డి, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్, కొప్పుల ఈశ్వర్ వెనుకంజలో ఉన్నారు. సనత్ నగర్ నియోజకవర్గం నుంచి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెనుకంజలో ఉన్నారు. మొత్తానికి తెలంగాణలో మంత్రుల మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నట్టు స్పష్టమవుతోంది. తెలంగాణ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్, నిరంజన్ రెడ్డిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోందని ఈ ఎన్నికలతో స్పష్టం అయింది.