Ponguleti Srinivas Reddy : ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు నియోజకవర్గాల నుంచి పొంగులేటి పోటీ.. ఓటమి భయం పట్టుకుందా?
Ponguleti Srinivas Reddy : సాధారణంగా ఎవరైనా ఒక నియోజకవర్గం నుంచే పోటీ చేస్తారు. మా అంటే రెండు నియోజకవర్గాలు అనుకోండి. ఎందుకంటే.. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరుపున రెండు నియోజకవర్గాల్లో పోటీ చేశారు. గాజువాక, భీమవరం.. సరే.. ఆయనంటే జనసేన అధినేత కాబట్టి ఆయన ఎన్ని నియోజకవర్గాల నుంచి అయినా పోటీ చేసుకోవచ్చు. తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇవన్నీ పక్కన పెడితే.. కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కళ్లు ఇప్పుడు మూడు నియోజకవర్గాల మీద పడ్డాయట.
అవే.. కొత్తగూడెం, ఖమ్మం, పాలేరు. ఈ మూడు నియోజకవర్గాల్లో పోటీ చేయాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. నిజానికి ఈ మూడు నియోజకవర్గాలు కాంగ్రెస్ కి కంచుకోటలనే చెప్పుకోవాలి. మూడు నియోజకవర్గాల్లో తాను పోటీకి సిద్ధంగా ఉన్నట్టు పీసీసీకి దరఖాస్తు చేసుకున్నారు పొంగులేటి. నిజానికి పాలేరు నియోజకవర్గం నుంచి పొంగులేటి పోటీ చేస్తారనే వార్తలు వినిపించాయి. మరోవైపు షర్మిలను కాంగ్రెస్ లోకి తీసుకొని పాలేరు నుంచి ఆమెను పోటీ చేయించాలని కూడా కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. ఈనేపథ్యంలో పొంగులేటి మూడు నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు సుముఖత చూపించడం కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశమైంది.
Ponguleti Srinivas Reddy : పొంగులేటి వియ్యంకుడు కూడా బరిలోకి?
పొంగులేటి వియ్యంకుడు రఘురామిరెడ్డి కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి పాలేరు తరుపున టికెట్ ఆశిస్తున్నాడు. పొంగులేటి కూడా టికెట్ ఆశిస్తుండటంతో పొంగులేటి నుంచి కాకుండా.. రేవంత్ రెడ్డి ద్వారా మంతనాలు జరుపుతున్నాడు. అసలే పాలేరు టికెట్ కోసం కాంగ్రెస్ లో తీవ్రమైన పోటీ నెలకొన్నది. ఈనేపథ్యంలో పాలేరు టికెట్ ఎవరికి లభిస్తుంది అనే దానిపై క్లారిటీ ఎప్పుడు వస్తుందో వేచి చూడాల్సిందే.