Housing Scheme : ఇందిరమ్మ పథకం లబ్ధిదారులకి గుడ్ న్యూస్.. వారికి రూ.5 లక్షలు ఇచ్చేది అప్పుడే..!
ప్రధానాంశాలు:
Housing Scheme : ఇందిరమ్మ పథకం లబ్ధిదారులకి గుడ్ న్యూస్..వారికి రూ.5 లక్షలు ఇచ్చేది అప్పుడే..!
Housing Scheme : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వారు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుతూ వస్తున్నారు. తాజాగా రాష్ట్రం ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇందిరమ్మ ఇళ్లు డిజైన్ ఎలా ఉండాలి? ఏ దశలో ఎంతెంత డబ్బులు అందిస్తారు అనే దానిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఆరు గ్యారంటీల హామీ ఇవ్వగా, ఇప్పటికే మహాలక్ష్మీ ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి ఫ్రీ కరెంట్, రైతు రుణమాఫీ వంటి అమలు చేశారు.
Housing Scheme : ఇవి తప్పనిసరి..
ఇక ఇందిరిమ్మ ఇండ్ల పథకం కూడా ఆరు హామీల్లో కీలక హామీ.. ఇండ్లు నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఇండ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చింది. ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించింది. దీంతో సొంత జాగా ఉండి ఇండ్లు నిర్మించుకోవాలనుకునే పేదల ఈ పథకం ఎప్పుడెప్పుడు అమలు చేస్తారా.. అని ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక అప్డేట్ ఇచ్చారు.ఈనెల 6వ తేదీ నుంచి క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల గుర్తింపు ప్రారంభమవుతుందని, దీనికోసం ప్రత్యేకంగా ఒక యాప్‌ను రూపొందించినట్లు మంత్రి పొంగులేటి వెల్లడించారు. 15-20 తేదీల మధ్య గ్రామసభల ద్వారా అర్హులైన వారిని గుర్తించి జాబితాలు ఖరారు చేస్తామన్నారు.
ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి అర్హత చూస్తే.. దరఖాస్తు దారుడు భారతీయుడై ఉండాలి. లబ్ధిదారు పేరు మీద రిజిస్టర్ స్థలం ఉండాలి. ఇతర ప్రభుత్వ గృహ పథకాల లబ్ధిదారులు దీనికి అర్హులు కాదు.ఇందిరమ్మ పథకానికి దరఖాస్తు చేసుకునే వారి వయస్సు 18 ఏళ్లు ఉండాలి. ఇందిరమ్మ పథకం కోసం కొన్ని పత్రాలు కూడా సమర్పించాలి. సొంత స్థలం ఉండి ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకునేవారు సొంత స్థలం ఉందని రుజువు చేయడానికి రిజిస్ట్రేషన్ పత్రాలు ఉండాలి.ఆదాయ ధృవీకరణ పత్రం ఉండాలి. దరఖాస్తుతో పాటు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో జత చేయాలి. మండల కార్యాలయంలో లేదంటే పంచాయతీ కార్యాలయంలో దరఖాస్తులు నింపి పత్రాలు జోడించాలి. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి పేద కుటుంబాలు, సొంత స్థలం కలిగిన వారు మాత్రమే అర్హులు.ఆదార్ కార్డ్, ఆదాయ ధృవీకరణ పత్రం, భూమి పత్రాలు, పాస్ పోర్ట్ ఫొటో తప్పనిసరిగా అవసరం ఉంటుంది.