Congress : బీఆర్ఎస్ పాలనలో 24 గంటల కరెంట్ .. కాంగ్రెస్ పాలనలో 14 గంటల కరెంట్ .. కారణం ఏంటి..? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Congress : బీఆర్ఎస్ పాలనలో 24 గంటల కరెంట్ .. కాంగ్రెస్ పాలనలో 14 గంటల కరెంట్ .. కారణం ఏంటి..?

Congress  : గత పాలకులు ఏం చేశారు అన్నది మాకు అనవసరం అని, కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ప్రజలకు తప్పకుండా అందిస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు అన్నారు. బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే అంతు చూస్తామని అంటున్నారు. ఆరు గ్యారెంటీలను ఇస్తామని మల్లికార్జున ఖర్గే కూడా చెప్పారని, రాహుల్ గాంధీ కూడా అమలు చేయాలని అన్నారని గుర్తు చేశారు. పథకాలు వెంటనే అమలులోకి రావాలంటే ఎలా వస్తాయి అని ప్రశ్నించారు. […]

 Authored By aruna | The Telugu News | Updated on :30 January 2024,6:00 pm

ప్రధానాంశాలు:

  •  Congress : బీఆర్ఎస్ పాలనలో 24 గంటల కరెంట్ .. కాంగ్రెస్ పాలనలో 14 గంటల కరెంట్ .. కారణం ఏంటి..?

Congress  : గత పాలకులు ఏం చేశారు అన్నది మాకు అనవసరం అని, కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ప్రజలకు తప్పకుండా అందిస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు అన్నారు. బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే అంతు చూస్తామని అంటున్నారు. ఆరు గ్యారెంటీలను ఇస్తామని మల్లికార్జున ఖర్గే కూడా చెప్పారని, రాహుల్ గాంధీ కూడా అమలు చేయాలని అన్నారని గుర్తు చేశారు. పథకాలు వెంటనే అమలులోకి రావాలంటే ఎలా వస్తాయి అని ప్రశ్నించారు. అసెంబ్లీలో బిల్లు వేసాం, ఒక్కొక్కటి ప్రజలకు అందుతూ వస్తున్నాయి. ఆరు పథకాలన్నీ వంద రోజుల్లో అమలు చేస్తామని వి.హనుమంతరావు అన్నారు.

ఇక బీఆర్ఎస్ హయాంలో 24 గంటల కరెంటు ఉండేదని, కాంగ్రెస్ ప్రభుత్వంలో 14 గంటల కరెంటు ఉంటుందని హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు వి.హనుమంతరావు స్పందించారు. మేము కూడా నాలుగు రోజులలో అన్నీ తెలుసుకొని కరెంటు ఇస్తామని, గత ప్రభుత్వంలో కూడా కొన్నిసార్లు కరెంటు పోయేదని గుర్తు చేసారు. అక్కడక్కడ బీఆర్ఎస్ అధికారులు పనిచేస్తున్నారు. ఇక సీఎం ఆఫీస్ లో ఉన్న బీఆర్ఎస్ అధికారులను రేవంత్ రెడ్డి మార్చారు. అన్ని ఆలోచించుకొని 24 గంటల కరెంటు త్వరలోనే తీసుకొస్తామని అన్నారు. మహిళలకు 2500, 2 లక్షల రుణమాఫీ వంటివి కూడా ప్రజలకు అందిస్తామని, ప్రతిపక్ష పార్టీలు ఎన్ని విమర్శలు చేసినా, మా పని మేము చేసుకుంటూ పోతామని అన్ని హామీలను నెరవేరుస్తామని అన్నారు.

మీరు పదవిలో అధికారంలో ఉన్నప్పుడు మేము ఊరుకున్నాం కదా మీరు కూడా అలాగే పోరాటం చేయండి. ఊరికే కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయకండి అని వి.హనుమంతరావు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు రీకౌంటర్ ఇచ్చారు. గత ప్రభుత్వం మూడు ఎకరాల భూమి, ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ వారు అవి నెరవేర్చలేదు. ఇప్పుడు మేము ఒక్కొక్కటి పథకాలను నెరవేరుస్తూ వస్తుంటే వారు విమర్శిస్తున్నారు అని అన్నారు. ఒకేసారి అన్ని పథకాలు రావాలంటే ఎలా వీలవుతాయి అని ప్రశ్నించారు. ఇక శాసనసభ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ ని నమ్మి ఓటేశారు. అలాగే లోక్ సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ సత్తా చాటుతుందని వి.హనుమంతరావు ధీమా వ్యక్తం చేశారు.

aruna

డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక