Revanth Reddy : కేసీఆర్‌ పై రేవంత్ రెడ్డి వ్యూహాత్మక చర్యలు… చంద్రబాబు ప్రతీకారమా.. | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Revanth Reddy : కేసీఆర్‌ పై రేవంత్ రెడ్డి వ్యూహాత్మక చర్యలు… చంద్రబాబు ప్రతీకారమా..

Revanth Reddy  : 2014 ప్రాంతంలో కేసీఆర్‌ ఎదుర్కొన్న రాజకీయ సంక్షోభాలని మళ్లీ తాను 2024లో ఎదుర్కోకుండా ఉండడం కోసం రేవంత్ రెడ్డి తనదైన శైలిలో పావులు కదుపుతున్నారు. చాలా ప్లాన్ తో ముందుకు వెళ్తున్నారు రేవంత్ రెడ్డి. ఎటువంటి పరిస్థితుల్లో అయిన సరే ప్రతిపక్షాలకు తలవంచకూడదు. ఎందుకంటే అవతల ఉన్నది కెసిఆర్. తక్కువ అయిన వ్యక్తి అసలు కాదు. కెసిఆర్ రాజకీయ చతురత రాజకీయ పరిస్థితి చాణిక్యత ఎట్లా ఉంటుందో ఆయనకు తెలుసు.ఎందుకంటే ఇద్దరూ కలిసి […]

 Authored By aruna | The Telugu News | Updated on :2 February 2024,6:00 pm

Revanth Reddy  : 2014 ప్రాంతంలో కేసీఆర్‌ ఎదుర్కొన్న రాజకీయ సంక్షోభాలని మళ్లీ తాను 2024లో ఎదుర్కోకుండా ఉండడం కోసం రేవంత్ రెడ్డి తనదైన శైలిలో పావులు కదుపుతున్నారు. చాలా ప్లాన్ తో ముందుకు వెళ్తున్నారు రేవంత్ రెడ్డి. ఎటువంటి పరిస్థితుల్లో అయిన సరే ప్రతిపక్షాలకు తలవంచకూడదు. ఎందుకంటే అవతల ఉన్నది కెసిఆర్. తక్కువ అయిన వ్యక్తి అసలు కాదు. కెసిఆర్ రాజకీయ చతురత రాజకీయ పరిస్థితి చాణిక్యత ఎట్లా ఉంటుందో ఆయనకు తెలుసు.ఎందుకంటే ఇద్దరూ కలిసి టీడీపీలో పని చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. బయటికి వచ్చిన తర్వాత గత పది ఏళ్లుగా ప్రతిపక్షాలను ముఖ్యంగా రేవంత్ రెడ్డిని ఎలా డ్రాప్ చేశారు ఎలా ఇరికించారు అని కేసీఆర్ అనేది రేవంత్ రెడ్డికి క్షుణ్ణంగా స్పష్టంగా తెలుసు.ఒక పక్క కెసిఆర్ మరోపక్క అతిపెద్ద బిజెపి పార్టీ కెసిఆర్ కోసం కాకపోయినా బీజేపీ పార్టీ కోసమైనా తన 64 లో ఒక ఐదుగురు లేదా ఆరుగురు లేదా నలుగురు నుంచి ఎవరైన జంపు అయితే కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మునుగుతుంది అనే అంశం రేవంత్ రెడ్డి కి స్పష్టంగా తెలుసు. ఎందుకంటే బిజెపిలో ఉన్నది అమిత్ షా వంటి వ్యక్తులు ఉన్న జార్ఖండ్ లో ఏం జరుగుతుందో చూసాం. కర్ణాటకలో ఏం జరిగిందో చూసాం. అలాగే మహారాష్ట్రలోని శివసేనను ఎలా చేశారో చూసాం. ఈ రకమైనటువంటి అనితిక రాజకీయం చేయడంలో పేరు పెట్టినటువంటి వ్యక్తి సిద్ధంతాలను పక్కనపెట్టి రాజకీయం చేయడంలో అమిత్ షా నిష్ణాతుడు.అయితే ప్రస్తుతం నడుస్తున్నటువంటి బిజెపి హవాలో అమిత్ షా ఒక ఊపులో ఉన్నారు. కాబట్టి ఆయన చేతికి ఒక నలుగురు బిజెపికి వెళ్లిన ఒక ఇద్దరు టీఆర్ఎస్ పార్టీకి వెళ్లిన తనకి ఎంత పెద్ద తలకాయ నొప్పి అవుతుందో రేవంత్ రెడ్డికి చాలా స్పష్టంగా తెలుసు. 2014లో కూడా ఇలాంటి పరిస్థితి వచ్చింది.

63 సీట్లు టిఆర్ఎస్ పార్టీకి వచ్చాయి. అప్పటి కాంగ్రెస్ పార్టీకి 23 సీట్లు వస్తే ఇప్పుడు టిడిపి పార్టీకి 15 సీట్లు వచ్చాయి. తర్వాత ఎంఐఎం మిగతా సీట్లనే పంచుకున్నారు. అప్పట్లో ఉన్న ఫిరాయింపు చట్టం ప్రకారం ఫిరాయింపు చట్టం లో ఉన్న ప్రథమ రూల్స్ ప్రకారం ప్రాథమికంగా ఉన్న అంశాల ప్రకారం ఎవరైతే పార్టీ మారుతారో వారు అనర్హత వేటుకు గురవుతారు. స్పీకర్ వారిని అనాహరులుగా ప్రకటించాల్సి ఉంటుంది. లేకపోతే స్పీకర్ కి బ్యాడ్ నేమ్ వస్తుంది. అందుకనే అప్పట్లో కెసిఆర్ ఏం చేశారు అంటే అవతల వైపు టిడిపి నుండి లేదా కాంగ్రెస్ నుంచి ఎంఐఎం నుంచి కావచ్చు మిగతా తనకు సపోర్ట్ కావాలి. తన పార్టీకి సంబంధించి నాయకులను ఎలా కొనుకోవాలి. ఎందుకంటే 63 లో ఒక్కొక్కలు ఒక పార్టీకి వెళ్లి పోయిన తన ప్రభుత్వం పడిపోతుందని కేసీఆర్ కి తెలుసు కాబట్టి రాజ్యాంగంలో ఉన్నటువంటి లసుగులో ఉపయోగించుకొని లెజిస్టేటివ్ పార్టీ నీ మేడ్జిగ్ చేశారా అనిపిస్తుంది. అయితే అసలు లెజిస్టేటివ్ పార్టీ బెజ్జింగ్ అంటే ఏంటి. అప్పట్లో ఏం జరిగింది అంటే తెలుగు దేశం పార్టీలో ఉన్నటువంటి థర్డ్ మెజార్టీ పీపుల్ ఏ పార్టీలో అయినా కావచ్చు టు థర్డ్ మెజార్టీ పీపుల్ మేము అవతల పార్టీకి సపోర్ట్ చేస్తున్నామని ఒక లెటర్ రాస్తే సరిపోతుంది. స్పీకర్ కి రాజీనామా చేయక్కర్లేదు. అప్పట్లో ఇదే జరిగింది 15 మందిలో పదిమంది వెళ్లి కేసీఆర్ ని కలిశారు.

టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి ఫిక్స్ అయ్యారు. కేడిఎల్ కింద వీళ్లు ఫామ్ అయ్యారు. మా సపోర్ట్ అంతా కేసీఆర్ కి ఇస్తామని ఓపెన్ గా ప్రకటించారు. దీంతో చంద్రబాబు కూడా వీళ్ళని ఆపలేని పరిస్థితి అప్పట్లో ఉంది. అటువంటి రాజకీయాల్లో భాగంగా 2014లో గెలిచినటువంటి కెసిఆర్ 2016లో టీడీఎల్పి కి వెళ్లి తనలో విలీనం సక్సెస్ ఫుల్ గా విలీనం చేసుకోగలిగారు. అలా ఆయన విలీనం చేసుకోవడం మూలంగా అప్పట్లో ఉన్నటువంటి పోటాపోటీ మెజార్టీతో టిఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా 2018లో మళ్లీ ముందస్తు ఎలక్షన్ కి వెళ్ళగలిగింది. అలా కాకపోయి ఉంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పార్టీకి అంటే టిడిపికి మరొకరు కాంగ్రెస్ మరొకరు ఎంఎల్ఐ కి వెళ్లిపోయిన కూడా అప్పట్లో కేసీఆర్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి చాలా తలకాయ నొప్పి అయ్యేది. ప్రభుత్వం పడిపోయే అంత డేంజరస్ జోన్ లోకి పరిస్థితులు వెళ్ళేవి.  ఇక ఇప్పుడు ఇదే ప్లాన్ ని అమలుపరిచి ఈరోజు టిఆర్ఎస్ లో నుంచి వన్ టూ తర్డ్ ఆఫ్ పీపుల్ ని కెసిఆర్ కు సంబంధించిన రెండు పార్టీల నుంచి ఎల్పీ మ్యాజిక్ కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలుస్తుందని సమాచారం. అయితే ఆయన వెంటనే చేయకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఎంపీ ఎలక్షన్స్ హడావిడిలో ఉన్నారు. ఎంపీ ఎలక్షన్ లో గెలిచి తన తెలంగాణ నుంచి దాదాపు పది సీట్లు అయినా సరే సోనియా గాంధీకి ఎంపీలను ఇవ్వాలనే టార్గెట్ గా పని చేస్తున్నారు.

రేవంత్ రెడ్డి. ఎంపీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత దీని మీద ఫోకస్ చేస్తారు అని వార్తలు వస్తున్నాయి. ఇది చంద్రబాబు తరఫు నుంచి కూడా ఒక పగ అని, పగలు తీర్చుకునేందుకు రాజకీయ ప్రోగ్రామ్ అని చెబుతున్నారు. అయితే చంద్రబాబు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవ్వకపోవచ్చు కాని ఒకప్పుడు చంద్రబాబు నాయుడుని దారుణమైన దెబ్బ కొట్టిన కేసీఆర్ పదిమందిని తన వైపు తీసుకుని టిఆర్ఎస్ లో విలీనం చేసి తన ప్రభుత్వం పడిపోకుండా జాగ్రత్త పడ్డారు. ఇక ఇప్పుడు అదే ప్లాన్ రేవంత్ రెడ్డి తన గురువైన చంద్రబాబు కలిసి కేసీఆర్ పై వేసినటువంటి ప్లాన్ , ఎమ్మెల్యేలని లాక్కున్నే అటువంటి ప్లాన్ , అటువంటి పగను ఈరోజు చంద్రబాబుకు సంబంధించిన పగలు టిడిపికి సంబంధించిన పగను ఈరోజు కేసీఆర్ ఐడియా ని ఉపయోగించి 8, 9 ఏళ్ల నాటి పగలు రేవంత్ రెడ్డి తీర్చుకోపోతున్నారని తెలుస్తుంది. కేసీఆర్ పైన ఎంపీ ఎలక్షన్స్ తర్వాత ఈ పథకం అమలుపరిచే అవకాశం ఉంటుందని తెలుస్తుంది.

aruna

డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక