Revanth Reddy : ఫ్రీ కరెంట్ , గ్యాస్ సిలిండర్ రాక‌పోతే న‌న్ను నిలదీయండి… సీఎం రేవంత్ రెడ్డి..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Revanth Reddy : ఫ్రీ కరెంట్ , గ్యాస్ సిలిండర్ రాక‌పోతే న‌న్ను నిలదీయండి… సీఎం రేవంత్ రెడ్డి..!

Revanth Reddy : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేతబట్టి మూడు నెలలు అవ్వడంతో ఆరు గ్యారెంటీలలో మూడు గ్యారెంటీ లు విడుదల చేయడం జరిగింది. ఆర్గారంటీలలో ఒకటి మహిళలకు ఉచిత బస్, ప్రతి నెల 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అలాగే 500 కి సిలిండర్ కూడా 27న అమలుపరచడం జరిగింది. ఇంకా కొన్ని గ్యారెంటీలకు ప్రజలు […]

 Authored By aruna | The Telugu News | Updated on :28 February 2024,6:00 pm

ప్రధానాంశాలు:

  •  Revanth Reddy : ఫ్రీ కరెంట్ , గ్యాస్ సిలిండర్ రాక‌పోతే న‌న్ను నిలదీయండి... సీఎం రేవంత్ రెడ్డి..!

Revanth Reddy : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేతబట్టి మూడు నెలలు అవ్వడంతో ఆరు గ్యారెంటీలలో మూడు గ్యారెంటీ లు విడుదల చేయడం జరిగింది. ఆర్గారంటీలలో ఒకటి మహిళలకు ఉచిత బస్, ప్రతి నెల 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అలాగే 500 కి సిలిండర్ కూడా 27న అమలుపరచడం జరిగింది. ఇంకా కొన్ని గ్యారెంటీలకు ప్రజలు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఇక వీటిపై తొందర్లో క్లారిటీ ఇస్తారని ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో చేవెళ్ల సభలో ఈ పథకాల మీద సీఎం రేవంత్ రెడ్డి సుష్టత ఇవ్వడం జరిగింది. 500 కి సిలిండర్ ఉచిత కారణం ప్రజలకి అందివ్వనున్నామని.. ఎవరైనా అధికారులు మీ పథకాల మీకు రావని చెప్తే వారిని నిలదీసి అడగాలని సీఎం వెల్లడించారు. చేవెళ్ల సభలో సీఎం రేవంత్ అన్న హామీ ఇవ్వడం జరిగింది.

మీకు ఒకవేళ ఫ్రీ కరెంట్ 500 కి గ్యాస్ ఇవ్వకపోతే ఆఫీసర్ తో చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఫ్రీ కరెంట్ 500 కి గ్యాస్ సిలిండర్ ఈ రెండు పథకాలు రాకపోతే ప్రజలు ఇబ్బంది పడవలసిన అవసరం లేదని రేవంతు చెప్పారు. ఎంఆర్ఓ లేదా ఎంపీడీవో ఆఫీసులకు వెళ్లి గ్యాస్ కనెక్షన్ రేషన్ కార్డు లేదా ఆధార్ కార్డు చూపిస్తే సరిపోతుంది. ఎవరైనా ఈ స్కీం మీకు రాదు అని చెప్తే అధికారులు నిలదీయొచ్చని రేవంతన్న హామీ ఇచ్చారు.చేవెళ్లలో సభలో రేవంత్ ఈ హామీ ఇవ్వడం జరిగింది.. మీ చుట్టుపక్కల ఉన్న ఆఫీసర్ తో మీరు ఫిర్యాదు చేయవచ్చని ప్రజలు ఎటువంటి ఆందోళన చెందవద్దని సీఎం రేవంత్ రెడ్డి చేవెళ్ల చెప్పారు. 6 గ్యారంటీల అమలు మీదే ఫోకస్ పెట్టామని రేవంత్ రెడ్డి తెలిపారు.
తాము అధికారంలోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే 25 వేల మంది నిరుద్యోగులకు నియమాక పత్రాలను ఇచ్చామని ఆయన తెలిపారు. ఇక తొందరలోనే మెగా డీఎస్సీ ని వేస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు… చేవెళ్లలో జన జాతర సభలో రేవంత్ మరిన్ని ఆసక్తికర విషయాలు తెలిపారు.

రేవంత్ అంటే అల్లాటప్ప అనుకోవద్దని గర్జించారు. సాధారణ కార్యకర్త లెవెల్ నుంచి సీఎం లెవెల్ కి ఎదిగానని నన్ను తక్కువ అంచనా వేయొద్దని ఆయన హెచ్చరించారు. చంచల్గూడా జైల్లో పెట్టిన లొంగిపోకుండా మేము పోరాడుతామని తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తలు నేతలు ఎన్నికల ముందు ఉన్న జోష్ ఇంకా కొనసాగుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కార్యకర్తల కష్టం ఎంతో ఉందని ఆయన తెలిపారు. వాళ్ళ త్యాగాలని ఏనాటికి మరువబోవమని సోనియాగాంధీ మాట ఇస్తే ఖచ్చితంగా నెరవేరుస్తుందని
సభలో టిఆర్ఎస్ పార్టీల నేతలపై ఆయన త్రీవర విమర్శలు చేయడం జరిగింది. దమ్ముంటే లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు నెగ్గి చూపించమని కేటీఆర్ కు రేవంత్ సవాళ్లు జరిగింది. టిఆర్ఎస్ పదే పదే కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చడానికి ప్రయత్నిస్తున్నారని సీఎం ఆరోపించారు. మమ్మల్ని టచ్ కూడా చేయలేరని ఆయన ధీమాగా చెప్పారు.ఇలా చేవెళ్ల సభలో రేవంత్ రెడ్డి ఆసక్తికర విషయాలను మాట్లాడారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది