Revanth Reddy : ఎమ్మెల్యేల‌కి రేవంత్ రెడ్డి చుర‌క‌లు.. జాగ్ర‌త్త‌గా ప‌ని చేయాలంటూ హెచ్చ‌రిక‌..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Revanth Reddy : ఎమ్మెల్యేల‌కి రేవంత్ రెడ్డి చుర‌క‌లు.. జాగ్ర‌త్త‌గా ప‌ని చేయాలంటూ హెచ్చ‌రిక‌..!

Revanth Reddy : రేవంత్ రెడ్డి తెలంగాణ‌లో అనేక మార్పులు చేర్పులు చేస్తూ అంద‌రి ప్ర‌శంస‌లు అందుకుంటున్నారు. అయితే ప్ర‌తిపక్షాలు మాత్రం విమ‌ర్శ‌లు చేస్తూనే ఉన్నాయి. అయితే రేవంత్ రెడ్డి రీసెంట్‌గా సీఎల్పీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీలోని కొందరు ఎమ్మెల్యేలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారన్నారు. జాగ్రత్తగా మెలగాలని వారికి సీఎం రేవంత్‌రెడ్డి హితవు పలికారు.ప్రతి ఎమ్మెల్యే సాయంత్రం 4.00 గంటల నుంచి 6.00 గంటల వరకు నియోజకవర్గ ప్రజలను కలిసేందుకు […]

 Authored By ramu | The Telugu News | Updated on :23 September 2024,9:00 pm

ప్రధానాంశాలు:

  •  Revanth Reddy : ఎమ్మెల్యేల‌కి రేవంత్ రెడ్డి చుర‌క‌లు.. జాగ్ర‌త్త‌గా ప‌ని చేయాలంటూ హెచ్చ‌రిక‌

Revanth Reddy : రేవంత్ రెడ్డి తెలంగాణ‌లో అనేక మార్పులు చేర్పులు చేస్తూ అంద‌రి ప్ర‌శంస‌లు అందుకుంటున్నారు. అయితే ప్ర‌తిపక్షాలు మాత్రం విమ‌ర్శ‌లు చేస్తూనే ఉన్నాయి. అయితే రేవంత్ రెడ్డి రీసెంట్‌గా సీఎల్పీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీలోని కొందరు ఎమ్మెల్యేలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారన్నారు. జాగ్రత్తగా మెలగాలని వారికి సీఎం రేవంత్‌రెడ్డి హితవు పలికారు.ప్రతి ఎమ్మెల్యే సాయంత్రం 4.00 గంటల నుంచి 6.00 గంటల వరకు నియోజకవర్గ ప్రజలను కలిసేందుకు సమయం కేటాయించాలని పార్టీ ఎమ్మెల్యేలకు సూచించారు. బీసీ జనగణన అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయన్నారు.

Revanth Reddy క‌ష్ట‌ప‌డి పని చేయాలి..

త్వరలో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ కార్డు అందజేస్తామని పేర్కొన్నారు. ఈ కార్డు ఆధారంగానే ఆ ఫ్యామిలీకి సంక్షేమ పథకాలు అందుతాయని స్పష్టం చేశారు. ప్రతిపక్షాల విమర్శలను తిప్పుకొట్టే విధంగా సన్నద్దంగా ఉండాలని పార్టీ ఎమ్మెల్యేకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సీఎల్పీ సమావేశంలో పీసీసీ కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన బి. మహేశ్ కుమార్ గౌడ్‌ను సీఎం రేవంత్ రెడ్డి సన్మానించారు.గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల బదిలీలు.. ఇతర విషయాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకోవటంతో వారిని ప్రజలు ఓడించారు. మన ఎమ్మెల్యేలు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

Revanth Reddy ఎమ్మెల్యేల‌కి రేవంత్ రెడ్డి చుర‌క‌లు జాగ్ర‌త్త‌గా ప‌ని చేయాలంటూ హెచ్చ‌రిక‌

Revanth Reddy : ఎమ్మెల్యేల‌కి రేవంత్ రెడ్డి చుర‌క‌లు.. జాగ్ర‌త్త‌గా ప‌ని చేయాలంటూ హెచ్చ‌రిక‌

ప్రతిపక్షాల నుంచి వచ్చే విమర్శల్ని తిప్పి కొట్టే విధంగా కాంగ్రెస్ నేతలు పని చేయట్లేదన్న వాదన బలంగా వినిపిస్తోంది. తాజాగా ఆ అంశాన్ని సీఎం రేవంత్ ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పని చేసే వారికి పదవులువస్తాయి. పార్టీ అనుబంధ విభాగాల్లో పని చేసిన 36 మందికి నామినేటెడ్ పోస్టులు ఇచ్చాం. అధికారం కోల్పోయిన ప్రతిపక్షం అసహనంతో ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలకు పాల్పడుతోంది. పార్టీ నేతలు వాటిని తిప్పి కొట్టాలి అని అన్నారు. జ‌మిలి ఎన్నిక‌ల‌కి కూడా మ‌నం సిద్ధంగా ఉండాల‌ని అన్నారు. ఇక ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి.. కాంగ్రెస్ పార్టీలో చేరిన పీఏసీ చైర్మన్ అరెకపూడి గాంధీ, కడియం శ్రీహరి, దానం నాగేందర్, ప్రకాశ్ గౌడ్ తదితరులు సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది