Revanth Reddy : బీఆర్ఎస్‌కి ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వనంటున్న రేవంత్.. రుణమాఫీ విషయంలో రేవంత్ కొత్త స్కెచ్
Revanth Reddy : తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రైతు రుణమాఫీకి రేవంత్ సర్కార్ శ్రీకారం చుడుతున్నారు. ఆగస్టు-15 లోగా ఈ హామీని నెరవేరుస్తానని పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మాటిచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి ప్రక్రియ కూడా దాదాపు మొదలైంది. ఢిల్లీ పర్యటనలో బిజిబిజీగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి తాజాగా దీనిపై మాట్లాడారు.. రుణమాఫీపై నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. పంట రుణాల మాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదని.. అది కుటుంబాన్ని గుర్తించడం కోసం మాత్రమేనని రేవంత్ రెడ్డి క్లియర్ కట్‌గా చెప్పేశారు. రూ. 2 లక్షల వరకు మాత్రమే రుణమాఫీ ఉంటుందని.. మరోసారి స్పష్టం చేశారు.
Revanth Reddy రేవంత్ కొత్త స్కెచ్
బంగారు తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలు మాఫీ కావని కూడా సీఎం చెప్పేశారు. పాస్ బుక్ ఆధారంగానే రుణ మాఫీ ఉంటుందని రేవంత్ రెడ్డి ఒక్క మాటలో చెప్పేశారు. ‘కేసీఆర్ హయాంలో తీసుకొచ్చిన ‘ధరణి’లో ఉన్న లోపాలు సరి చేసే పనిలో ఉన్నాము. ఆ తరవాత ఏ పేరు పెట్టినా నడుస్తుంది. కంప్యూటరైజ్ చేయాలా..? లేక మాన్యూవల్ పద్ధతి పాటించాలా..? రెండే పద్ధతులు. ఏది చేయాలో అసెంబ్లీ ముందు పెట్టిన తర్వాతే నిర్ణయం ఉంటుంది. ఏ పాలసీ అయినా… ముందు అసెంబ్లీలో పెట్టి చర్చించిన తర్వాతే మార్పు చేర్పులతో తుది విధానం ప్రకటన చేస్తాము. ఐఏఎస్, ఐపీఎస్‌ల పోస్టింగ్స్‌లో రూల్స్ బ్రేక్ చేయం. కేసీఆర్ చేసిన తప్పులను మేం చెయ్యం’ అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
మరోవైపు రుణమాఫీకి సంబంధించిన నిధుల సమీకరణకి ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోంది. రైతు భరోసా కోసం కేటాయించిన నిధులను కూడా ఇటు మళ్లించి తర్వాత వాటికి సర్దుబాటు చేయాలని భావిస్తోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు తర్వాత భరోసా విధివిధానాలు ఖరారు కానున్నాయి. డూప్లికేషన్, డబుల్ పేమెంట్ సమస్య లేకుండా చూసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అనెక్సర్ ఏ బీల్లో ఉన్న వివరాలను అనెక్సర్ సీలో పొందుపరుస్తారు. రేషన్ కార్డుగా ప్రామాణికంగా కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకొని మాఫీ లబ్ధిదారులను గుర్తిస్తారు. ఈ కుటుంబాలను గుర్తించే బాధ్యతను ఏఈవోలకు, పంచాయతీ కార్యదర్శులకు అప్పగించారు. ఎన్ని బ్యాంకుల్లో ఎంత అప్పులు ఉన్నా 2 లక్షల వరకు మాఫీ అవుతుంది.