Revanth Reddy : కోచింగ్ సెంట‌ర్ య‌జ‌మాని దీక్ష‌.. ఇంకొక‌డు గిల్ల‌డానికి దీక్ష‌.. రేవంత్ రెడ్డి సెటైర్స్… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Revanth Reddy : కోచింగ్ సెంట‌ర్ య‌జ‌మాని దీక్ష‌.. ఇంకొక‌డు గిల్ల‌డానికి దీక్ష‌.. రేవంత్ రెడ్డి సెటైర్స్…

 Authored By ramu | The Telugu News | Updated on :14 July 2024,8:00 pm

ప్రధానాంశాలు:

  •  Revanth Reddy : కోచింగ్ సెంట‌ర్ య‌జ‌మాని దీక్ష‌.. ఇంకొక‌డు గిల్ల‌డానికి దీక్ష‌.. రేవంత్ రెడ్డి సెటైర్స్...

Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాను ఏం అనుకున్నాడో అదే విష‌యాన్ని కుండ బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు చెబుతాడు. డీఎస్సీ పరీక్ష వాయిదా అంశంపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి కామెంట్ చేశారు. డీఎస్సీని వాయిదా వేయాలని ముగ్గురు ఆమరణ నిరాహార దీక్ష చేస్తే.. వారిలో ఒక్కరు కూడా పరీక్ష రాసే అభ్యర్థులు లేరని రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం జేఎన్టీయూలో క్వాలిటీ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్‌పై నిర్వహించిన ఇంటరాక్షన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా డీఎస్సీ అంశంపై స్పందించారు. పోటీ పరీక్షలకోసం నిరాహార దీక్షలు చేసేవారిపై సెటైర్లు పేల్చారు సీఎం రేవంత్ రెడ్డి. పరీక్షలు వాయిదా వేయాలంటూ ముగ్గురు దీక్షలు చేస్తే, అందులో ఒక్కరు కూడా పరీక్ష రాయట్లేదని, కనీసం దరఖాస్తు కూడా చేయలేదని చెప్పారు.

రేవంత్ పంచ్‌లు..

పరీక్ష వాయిదా కోసం కోచింగ్ సెంటర్ యజమాని ఎక్కడైనా ఆమరణ దీక్ష చేస్తారా అని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. 2 నెలలు డీఎస్సీ పోస్ట్ పోన్ అయితే కోచింగ్ సెంటర్ నిర్వాహకుడికి 100 కోట్ల రూపాయలు లాభం వస్తుందని, అందుకే ఆయన దీక్ష చేస్తున్నట్టు తెలిసిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అప్పటి వరకూ తన పార్టీలోనే ఉన్న మరో వ్యక్తి కూడా దీక్ష చేశాడని, పార్టీలో ఉద్యోగం ఇవ్వలేదని తనను గిల్లడానికి ఆయన దీక్షకు కూర్చున్నాడని చెప్పారు. గాంధీ ఆస్పత్రిలో దీక్ష చేస్తున్న యువకుడికి స్పెషల్ కోచింగ్ ఇచ్చేందుకు తాను సిద్ధపడ్డానని, ఎంక్వయిరీ చేస్తే అతడు కూడా పరీక్షలు రాయట్లేదని తేలిందని, ఎవరో లీడర్ చెప్పారని దీక్ష చేస్తున్నాడని తెలిసిందని అన్నారు. పరీక్షల వాయిదా కోసం నిరాహార దీక్షలు చేస్తున్నవారెవరూ అభ్యర్థులు కాదని తేల్చేశారు సీఎం రేవంత్ రెడ్డి.

Revanth Reddy కోచింగ్ సెంట‌ర్ య‌జ‌మాని దీక్ష‌ ఇంకొక‌డు గిల్ల‌డానికి దీక్ష‌ రేవంత్ రెడ్డి సెటైర్స్

Revanth Reddy : కోచింగ్ సెంట‌ర్ య‌జ‌మాని దీక్ష‌.. ఇంకొక‌డు గిల్ల‌డానికి దీక్ష‌.. రేవంత్ రెడ్డి సెటైర్స్…

అలాంటి వారికోసం పరీక్షలు వాయిదా వేసే ప్రసక్తే లేదని క్లారిటీ ఇచ్చారు. గ్రూప్ 1 ఫైనల్స్‌కు 1:50కి బదులుగా 1:100 పద్ధతిని అనుసరించాలని కొందరు కోరుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నోటిఫికేషన్‌లో చెప్పిన దానికి భిన్నంగా వ్యవహరిస్తే.. కోర్టులు వెంటనే ఆ ప్రక్రియను నిలిపేస్తాయంటూ పేర్కొన్నారు. దీంతో మళ్లీ గ్రూప్ 1 పరీక్షలు వాయిదా పడతాయని సీఎం రేవంత్ వివరించారు. త్వరలోనే అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని సీఎం రేవంత్ అన్నారు. మార్చి చివర్లో ఖాళీ వివరాలు తెప్పిస్తామని.. జూన్ 2న నోటిఫికేషన్ ఇచ్చి.. డిసెంబర్ 9 నాటికి ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పారు. ఈ విధానానికి చట్టబద్ధత కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. టీఎస్ పీ సీ సభ్యుల ఎంపిక విషయంలో గతంలో అవలంభించిన విధానాలను సీఎం రేవంత్ తప్పుబట్టారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది