Harish rao : ఎమ్మెల్సీ ఓట్ల కోసం హరీష్ ను ఫుల్‌గా వాడేస్తున్న కేసీఆర్.. ఆ తర్వాత పీకేస్తాడట
Harish rao : టీఆర్‌ఎస్ లో కేసీఆర్ మరియు కేటీఆర్ తర్వాత అత్యంత ప్రజాధరణ ఉన్న నాయకుడు హరీష్ రావు అనడంలో సందేహం లేదు. కొన్ని ప్రాంతాల్లో కేటీఆర్ కంటే కూడా అధికంగా ప్రజాధరణ హరీష్ రావుకు ఉంటుంది అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదటి సారి టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన సమయంలో హరీష్ రావు భారీ నీటి పారుదల శాఖ నిర్వహించి రావు, చూడము అనుకున్న నీటిని ప్రాజెక్ట్ లను తీసుకు వచ్చాడు, నీటిని చూపించాడు. అందుకే హరీష్ రావు అంటే ఎంతో మందికి అభిమానం అనడంలో సందేహం లేదు. ఆయనకు ఉన్న క్రేజ్ అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో ఆయన ఏ ఎన్నికల్లో అయినా ముందు నిలబడితే విజయాన్ని సాధించే స్థాయికి చేరుకున్నారు. అందుకే కీలకమైన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన్ను ముందు ఉంచి కేసీఆర్ ప్రచారం చేయిస్తున్నారు.
Harish rao : ప్రచార బాధ్యత హరీష్ పై…
జీహెచ్‌ఎంసీ పరిధిలో హరీష్ కు బాధ్యతలు అప్పగించిన వార్డులు అన్ని టీఆర్‌ఎస్ ఘన విజయం సాధించింది. ఆయన పక్క వార్డులకు కూడా ప్రచారం చేసి తనకు అప్పగించని వాటి విజయానికి కూడా దోహదం చేశాడు. హరీష్ రావు అలా వెళ్లి ప్రచారం చేస్తే విజయం గ్యారెంటీ అన్నట్లుగా పరిస్థితి ఉంది. అందుకే కేసీఆర్ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార బాధ్యత ను హరీష్ రావుకు అప్పగించారు. కేటీఆర్ మరియు హరీష్ రావులు సమన్వయంలో ఈ రెండు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. కాస్త అటు ఇటు అయినా కూడా ప్రభుత్వం లో ఉన్న టీఆర్‌ఎస్ పరువు పోతుంది. అందుకే హరీష్ రావు తనదైన శైలిలో ప్రచారం చేస్తూ ముందుకు కదులుతున్నాడు.
Harish rao : ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత హరీష్ కు ఉద్వాసన..
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలిచినా గెలవకున్నా కూడా హరీష్ రావుకు ఉద్వాసన తప్పదు అంటూ కాంగ్రెస్ నాయకుడు ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పటికే ఈటెలను పక్కన పెట్టారు. తర్వాత హరీష్ రావునే పక్కన పెట్టబోతున్నట్లుగా రేవంత్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కవిత కు మంత్రి పదవి ఇచ్చే ఉద్దేశ్యంతో హరీష్ రావును తప్పించడం లేదా ఆయనే స్వయంగా తప్పుకునేలా ఒత్తిడి తీసుకు రావడం వంటివి చేస్తారని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ప్రజల్లో హరీష్ రావుకు ఉన్న క్రేజ్ ను కేసీఆర్ కేటీఆర్ చూసి తట్టుకోలేక పోతున్నారు అంటూ కాంగ్రెస్ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.