Rythu Bharosa : గుడ్ న్యూస్… ‘రైతు భరోసా’ నిధులు వచ్చేస్తున్నాయోచ్..!
ప్రధానాంశాలు:
Rythu Bharosa : గుడ్ న్యూస్... ‘రైతు భరోసా’ నిధులు వచ్చేస్తున్నాయోచ్..!
Rythu Bharosa : తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం Telangana Govt Congress చేపట్టిన రైతు భరోసా పథకం ద్వారా రాష్ట్రంలోని అన్నదాతలకు పెట్టుబడి సాయాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రతీ ఏడాది ఖరీఫ్ మరియు రబీ సీజన్లలో ఎకరానికి రూ.12వేలు – రెండు విడతలుగా రైతుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. అయితే ఈసారి ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతుండటంతో, ప్రభుత్వం ఒకే దఫాలో పూర్తి రూ.12వేలను రైతులకు చెల్లించేందుకు సన్నాహాలు చేస్తోంది. దాదాపు 70 లక్షల మంది రైతులకు ఈ ప్రయోజనం లభించనున్నప్పటికీ, ఇందుకోసం సుమారు రూ.15 వేల కోట్ల నిధులు అవసరమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

Rythu Bharosa : గుడ్ న్యూస్… ‘రైతు భరోసా’ నిధులు వచ్చేస్తున్నాయోచ్..!
Rythu Bharosa : ‘రైతు భరోసా’ నిధుల కోసం ఎదురుచూస్తున్న రైతులకు గుడ్ న్యూస్
రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో రైతులకు జరిగిన అన్యాయాన్ని పరిహరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గతంలో బకాయిలుగా ఉన్న రైతు బంధు నిధులను చెల్లించేందుకు ఇప్పటికే రూ.7,600 కోట్లు విడుదల చేశామని తెలిపారు. ఈ ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి రైతులు వరినాట్లు వేసే నాటికి భరోసా నిధులు వారి ఖాతాల్లో జమ చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.
తమ విధానాన్ని పూర్తిగా అమలు చేయాలంటే ప్రభుత్వం భారీ ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొవలసి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే, రూ.15వేల కోట్లు ఒక్కసారిగా విడుదల చేయడం పెద్ద సవాలుగా మారనుంది. అందువల్ల పాత విధానంలాగే నిధులను రెండు విడతలుగా చెల్లిస్తుందా లేదా, రైతులకోసం ఒకే విడతలో మొత్తం సాయం అందించేందుకు ధైర్యంగా ముందుకు వస్తుందా అనేది ఆసక్తికర అంశంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఇంకా అధికారికంగా స్పష్టం కాకపోయినా, రైతులకు త్వరితగతిన పెట్టుబడి సాయం అందించాలన్న దిశగా చర్యలు కొనసాగుతున్నాయి.