Rythu Bharosa : రైతు భరోసా కొత్త మార్గదర్శకాలు… ఇక వారికి లేనట్లే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Rythu Bharosa : రైతు భరోసా కొత్త మార్గదర్శకాలు… ఇక వారికి లేనట్లే…!

Rythu Bharosa : రైతు భరోసా అనేది ఒక కీలకమైన పథకం. అయితే ఈ పథకం అమలు విషయంపై ఏమాత్రం డబ్బు అనేది వృధా కాకూడదు అని కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. రైతు భరోసా నిధులను పక్కదారి పట్టనివ్వకుండా మార్గదర్శకాలను కూడా రెడీ చేస్తుంది. అవి ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం. ఏ పథకము అయినా సరే అర్హులు అయినా వారికి మాత్రమే అందాలి. అప్పుడే కదా టాక్స్ పేయర్స్ డబ్బుకు కూడా విలువ అనేది […]

 Authored By ramu | The Telugu News | Updated on :27 June 2024,8:00 am

Rythu Bharosa : రైతు భరోసా అనేది ఒక కీలకమైన పథకం. అయితే ఈ పథకం అమలు విషయంపై ఏమాత్రం డబ్బు అనేది వృధా కాకూడదు అని కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. రైతు భరోసా నిధులను పక్కదారి పట్టనివ్వకుండా మార్గదర్శకాలను కూడా రెడీ చేస్తుంది. అవి ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం. ఏ పథకము అయినా సరే అర్హులు అయినా వారికి మాత్రమే అందాలి. అప్పుడే కదా టాక్స్ పేయర్స్ డబ్బుకు కూడా విలువ అనేది ఉంటుంది. గత బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రైతుబంధు పథకానికి సంబంధించిన నిధులు అన్నీ కూడా పక్కదారి పట్టాయి అంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం. రైతు భరోసా పథకాన్ని మాత్రం అలా నీరు కార్చే ప్రసక్తి లేదు అని అంటుంది. అయితే అనర్హులను ఏరిపారేసి నిజమైన రైతులకు మాత్రమే అమలు చేస్తాము అని అంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా ఈ స్కీమ్ ను అమలు చేస్తాం అని తెలిపింది. ఈ స్కీము కు సంబంధించినటువంటి ప్రభుత్వం, గ్రామాల వారీగా తనిఖీ చేస్తూ సాగు భూమి ఎంత ఉన్నది. రియల్ ఎస్టేట్ భూములు ఎన్ని ఉన్నాయి. గుట్టలు, కొండలు ఎన్ని ఉన్నాయి. సాగు చెయ్యని దేవదాయ వర్ఫ్ భూములు ఏవి ఉన్నాయి. లాంటి వివరాలు అన్నింటినీ సేకరించిన తర్వాత వ్యవసాయ శాఖ పూర్తిస్థాయిలో మూడు రోజులుగా సర్వేలు చేస్తున్నది. వచ్చే వారం కల్లా ఈ సర్వే అనేది పూర్తి అవుతుంది.

బిఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు పేరుతో ప్రతి రైతుకు ఏడాదికి ఎకరానికి రూ.10,000 చొప్పున పెట్టుబడి సాయం అనేది అందించింది. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రూ. 15,000 అందిస్తామని హామీ ఇచ్చింది. అంతేకాక రైతు మరియు కౌవులు రైతులకు కూడా సంవత్సరానికి ఎకరానికి రూ.15,000 ఇస్తాము అని ఎన్నికల మ్యానిఫెస్టోలో తెలిపింది. అంతే రైతు కూలీలకు ఎకరానికి సంవత్సరానికి రూ.12000 ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ ఇంతవరకు కూడా ఈ స్కీమ్ అనేది అమలు కాలేదు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ కి రైతు భరోసా కింద పెట్టుబడి సాయాన్ని రైతులకు ఇవ్వాల్సి ఉన్నది. కానీ అనర్హులను తొలగించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నది. ఈ ప్రక్రియ అనేది పూర్తి అయితే గాని రైతు భరోసా స్కీమ్ అనేది అమలు కాదు. అప్పటివరకు కూడా రైతుబంధు కిందే ఈ నిధులు అనేవి పంపిణీ చేయడం జరుగుతుంది.

Rythu Bharosa రైతు భరోసా కొత్త మార్గదర్శకాలు ఇక వారికి లేనట్లే

Rythu Bharosa : రైతు భరోసా కొత్త మార్గదర్శకాలు… ఇక వారికి లేనట్లే…!

కొత్త మార్గదర్శకాల అమలు ప్రకారం చూసినట్లయితే, ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఐటి చెల్లింపు దారులు,ప్రజా ప్రతినిధులు, బడా వ్యాపార వేత్తలకు ఈ పథకం అనేది అస్సలు వర్తించదు. అంతేకాక బీడు భూములు, రోడ్లు,రియల్ ఎస్టేట్ వెంచర్లకు కూడా ఈ నిధులు అనేవి అందవు. ఇలా చేయటం వలన ప్రభుత్వానికి చాలా డబ్బు అనేది మిగులుతుంది. రైతు భరోసా పథకం అనేది ఐదు ఎకరాల లోపు రైతులకు మాత్రమే ఇవ్వాలి అని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలిపింది. అలా చేస్తే గనుక రైతుల ఆగ్రహం చూస్తారు అని బిఆర్ఎస్ అంటుంది. అయితే అయిదు ఎకరాల కంటే ఎక్కువ ఉన్న రైతులు నష్టపోవాలా అని ప్రశ్నిస్తుంది. మూడు సంవత్సరాలుగా సాగు చేయని రైతులకు కూడా రైతు భరోసా అనేది ఇవ్వరు అని తెలుస్తుంది. ఈ మార్గదర్శకాలు అనేవి ఇంకా అధికారికంగా రాలేదు..

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది