Revanth Reddy : కోమటిరెడ్డికి సీఎం అర్హత ఉందన్న రేవంత్ రెడ్డి .. భట్టిని అవమానించడం కోసం అలా మాట్లాడాడా?
ప్రధానాంశాలు:
Revanth Reddy : కోమటిరెడ్డికి సీఎం అర్హత ఉందన్న రేవంత్ రెడ్డి .. భట్టిని అవమానించడం కోసం అలా మాట్లాడాడా?
Revanth Reddy : ప్రస్తుతం ఎక్కడ చూసిన రాజకీయం మరింత రంజుగా మారుతుంది. తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఎవరికి వారు ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. భువనగిరి ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్ అయ్యారు. తనతోపాటు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి అర్హుడని వ్యాఖ్యానించారు రేవంత్. ఉద్యమ సమయంలో మంత్రి పదవికి రాజీనామా చేశారని.. కోమటిరెడ్డి నిజమైన పోరాట యోధుడని రేవంత్ ప్రశంసల జల్లు కురిపించారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ దొంగ దీక్ష చేశారని, రాష్ట్రాన్ని కేసీఆర్ సర్వనాశనం చేశారని మండిపడ్డారు. అయితే రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతున్నాయి.
Revanth Reddy : రేవంత్ రెడ్డిపై గుస్సా..
నాయకులెవరూ దీనిపై బహిరంగంగా స్పందించకపోయినప్పటికీ లోపల మాత్రం బాగా వేడెక్కిపోతున్నారు. రేవంత్ వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సీనియర్ నాయకులు జానారెడ్డి, దామోదర్‌రెడ్డి వంటివారు ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. భట్టి తమ పార్టీ అధికారంలోకి తెచ్చేందుకు పాదయాత్ర చేశారు. చివరి క్షణం వరకు ఆయన పోటీపడ్డారు. చివరికి రాజకీయ పరిస్థితులు, సమీకరణల దృష్ట్యా ఆ పదవి చివరికి రేవంత్‌రెడ్డిని వరించింది. అయితే భట్టి పార్టీ కోసం అంత కష్టపడితే ఇప్పుడు రేవంత్.. వెంకటరెడ్డే సీఎం పదవికి అర్హుడని రేవంత్ చెప్పడం ఆయనకి ఏ మాత్రం మింగుడుపడడం లేదు.
రేవంత్ తన వ్యాఖ్యల ద్వారా భట్టికి సీఎం అయ్యే అర్హత లేదని పరోక్షంగా చెప్పారంటూ సీనియర్ నేతలు, ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.ఇదిలా ఉంటే పీసీసీ చీఫ్‌గా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్న సమయంలో ఆయన సీఎం అభ్యర్థి అన్న ప్రచారం కూడా జరిగింది. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన తర్వాత సీఎం పదవిని ఆశిస్తున్న వారిలో ఆయన పేరు కూడా వినిపించింది. మరో సీనియర్ నేత జానారెడ్డి కూడా సీఎం అయ్యే అర్హత ఉందని కూడా అందరు అన్నారు. అయితే ఇంత మందిని కాదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఒక్కరికే అర్హత ఉందనేలా రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీలో గందరగోళం సృష్టిస్తున్నాయి