AIYF : రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ వయోపరిమితి పెంపు ఆలోచనను విరమించుకోవాలి : ఏఐవైఎఫ్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

AIYF : రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ వయోపరిమితి పెంపు ఆలోచనను విరమించుకోవాలి : ఏఐవైఎఫ్

 Authored By ramu | The Telugu News | Updated on :27 January 2025,6:20 pm

ప్రధానాంశాలు:

  •  నిరుద్యోగ సమస్యను పరిష్కరించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచితంగా వ్యవహరిస్తే ఉద్యమిస్తాం

AIYF : రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల వయోపరిమితిని పెంచే ప్రతిపాదనకు ప్రయత్నాలు చేస్తున్నదని, ఈ ప్రతిపాదనను విరమించుకోవాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర కార్యదర్శి కె. ధర్మేంద్ర డిమాండ్ చేశారు.హిమాయత్ నగర్ లోని AIYF రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరును ఖండించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె. ధర్మేంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో ఉద్యోగుల వయోపరిమితి వయస్సు పెంచాలనే ప్రతిపాదన వల్ల రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు తీవ్రమైన అన్యాయం జరుగుతందని వారు అన్నారు.

AIYF రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ వయోపరిమితి పెంపు ఆలోచనను విరమించుకోవాలి ఏఐవైఎఫ్

AIYF : రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ వయోపరిమితి పెంపు ఆలోచనను విరమించుకోవాలి : ఏఐవైఎఫ్

గతంలో 58 సంవత్సరాలుగా ఉన్న రిటైర్మెంట్ వయస్సును 61 సంవత్సరాలకు పెంచారని, ఉద్యోగుల పదవి విరమణ వల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుందనే కారణంతో రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ ఇప్పుడు రిటైర్మెంట్ వయస్సు పెంచాలనే ప్రతిపాదన సరికాదన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పనే ప్రధాన ధ్యేయమని ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం, మరో వైపు నిరుద్యోగులను మోసం చేసే విధంగా నిర్ణయాలు తీసుకోవడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో సుమారు 45 లక్షల మంది నిరుద్యోగ యువత ఉద్యోగ,ఉపాధి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారన్నారు. రిటైర్మెంట్ అయిన ఖాళీ పోస్టులకు నోటిఫికేషన్లు వేసి రిక్రూట్మెంట్ చేపట్టాలనీ, నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి,పూర్తి స్థాయిలో భర్తీ చేయకుండా కాలయాపన చేస్తున్నదని ధ్వజమెత్తారు.

ఉద్యోగాల కల్పన చేయకుండా పాలకులు యువత శక్తి సామర్ధ్యాలను నీరుగారుస్తున్నారని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ ఉద్యోగ వయోపరిమితి వయస్సును పెంచాలనే కుట్ర చేస్తే ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నెర్లకంటి శ్రీకాంత్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు టి. సత్య ప్రసాద్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆర్. బాలకృష్ణ, మజీద్, కళ్యాణ్, అనీల్, అరుణ్ పాల్గొన్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది