Revanth Reddy : మరో 10 ఏళ్ళు మాదే అధికారం… నువ్వు ఎలా వస్తావో నేను చూస్తా.. రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Revanth Reddy : మరో 10 ఏళ్ళు మాదే అధికారం… నువ్వు ఎలా వస్తావో నేను చూస్తా.. రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్…!

Revanth Reddy : తాజాగా లాల్ బహదూర్ స్టేడియంలో మాట్లాడిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ నిరుద్యోగులు ఎవరు అధైర్య పడాల్సిన అవసరం లేదని, వారి సమస్యలను కచ్చితంగా పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. అలాగే కొత్తగా ఎంపికైన కానిస్టేబుల్ అభ్యర్థులకు లాల్ బహదూర్ స్టేడియం వేదికగా ఆయన నియామక పత్రాలు కూడా అందజేయడం జరిగింది. ఈ క్రమంలోనే రాష్ట్రం కోసం పోరాటం చేసిన యువత ఉద్యోగాలు సాధించడం చాలా సంతోషంగా ఉందని , […]

 Authored By aruna | The Telugu News | Updated on :15 February 2024,11:02 am

ప్రధానాంశాలు:

  •  Revanth Reddy : మరో 10 ఏళ్ళు మాదే అధికారం... నువ్వు ఎలా వస్తావో నేను చూస్తా..రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్...!

Revanth Reddy : తాజాగా లాల్ బహదూర్ స్టేడియంలో మాట్లాడిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ నిరుద్యోగులు ఎవరు అధైర్య పడాల్సిన అవసరం లేదని, వారి సమస్యలను కచ్చితంగా పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. అలాగే కొత్తగా ఎంపికైన కానిస్టేబుల్ అభ్యర్థులకు లాల్ బహదూర్ స్టేడియం వేదికగా ఆయన నియామక పత్రాలు కూడా అందజేయడం జరిగింది. ఈ క్రమంలోనే రాష్ట్రం కోసం పోరాటం చేసిన యువత ఉద్యోగాలు సాధించడం చాలా సంతోషంగా ఉందని , యువతను ఉద్యోగాల కోసం ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నుంచి గట్టెక్కిస్తామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా స్టేడియంలో ప్రస్తావించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కష్టాలు తీరుతాయని నిరుద్యోగులంతా ఆశించారని , కానీ గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ప్రభుత్వానికి ఉద్యోగాలు ఇచ్చే ఆలోచన రాలేదని మండిపడ్డారు.

ఇక ఇప్పుడు నియామక పత్రాలు ఇంటికే పంపించవచ్చు కదా అని హరీష్ రావు అంటున్నారని , కానీ యువత కళ్ళలో ఆనందం చూడటానికి , దానిని అందరితో పంచుకోవడానికి ఇలాంటి వేదికను ఏర్పాటు చేశామని రేవంత్ రెడ్డి తెలియజేశారు.అలాగే కెసిఆర్ తన కుటుంబ సభ్యులకు మాత్రమే పదవులు ఇచ్చారని యువత ఏం పాపం చేసిందని ఉద్యోగాలు ఇవ్వలేదంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇక తాజాగా నల్గొండ సభలో కేసీఆర్ మాట్లాడుతూ పాలిచ్చే బర్రెను ఇంటికి పంపించి దున్నపోతుని తెచ్చుకున్నామన్నారు. కానీ కంచర గాడిదను ఇంటికి పంపించి రేసుగుర్రాన్ని అధికారంలోకి తెచ్చుకున్నారని అసెంబ్లీలో అటెండర్ తనతో చెప్పినట్లుగా రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.అదేవిధంగా నీటి వాటాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకాలు తెలంగాణ ప్రజలకు మరణ శాసనాలుగా మారాయని ఢిల్లీలో పోరాడుదామని అంటే ఇంటి నుంచి బయటకు రాలేదన్నారు.

అందుకే యువత కోసం పనిచేయడానికి వారి సమస్యలను పరిష్కరించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి తెలియజేశారు.24 గంటలు కష్టపడి పని చేస్తామని ప్రజల ఆశీస్సులతో మరో 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం ఉంటుందని ఆయన తెలిపారు. ఇక వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ తాము అధికారంలోకి వస్తాం అంటున్నారని , ఎలా వస్తారో నేను కూడా చూస్తాను అంటూ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. దీంతో ప్రస్తుతం రేవంత్ రెడ్డి లాల్ బహుదూర్ స్టేడియంలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి. ఇది ఇలా ఉండగా ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ శాంతి కుమారి మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు , తుమ్మల నాగేశ్వరావు పలువురు పాల్గొనడం జరిగింది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది