Telangana Elections Results 2023 : ఓటమి దిశగా బీజేపీ అగ్ర నేతలు బండి సంజయ్, ఈటల, అర్వింద్, రఘునందన్..!
ప్రధానాంశాలు:
Telangana Elections Results 2023 : ఓటమి దిశగా బీజేపీ అగ్ర నేతలు బండి సంజయ్, ఈటల, అర్వింద్, రఘునందన్..!
Telangana Elections Results 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటి వరకు 10 రౌండ్లు ముగిశాయి. ఈనేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 65 స్థానాల్లో లీడ్ లో కొనసాగుతోంది. బీఆర్ఎస్ 40 స్థానాల్లో లీడ్ లో కొనసాగుతోంది. బీజేపీ BJP 9 స్థానాల్లో లీడ్ లో ఉంది. ఎంఐఎం 5 స్థానాల్లో లీడ్ లో ఉంది. ఇక.. బీజేపీకి చెందిన అగ్ర నేతలు, సీనియర్ అభ్యర్థులు బండి సంజయ్, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, రఘునందన్ ఓటమి దిశగా ఉన్నారు. వీళ్లంతా బీజేపీ ముఖ్య నేతలు. వీళ్లలో బండి సంజయ్ ఎంపీగా ఉన్నారు. అర్వింద్ కూడా ఎంపీగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఎంపీలుగా గెలిచిన వీళ్లు ఓడిపోతున్నారు. ఇక.. దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచిన రఘునందన్ రావు.. ఈసారి ఓటమి దిశలో ఉన్నారు. ప్రస్తుతానికి బీజేపీ కేవలం 9 నియోజకవర్గాల్లో మాత్రమే లీడ్ లో ఉంది. సిర్పూర్, ఆదిలాబాద్, నిర్మల్, ముథోల్, కార్వాన్, గోషామహల్, యాకుత్ పురాలో బీజేపీ లీడ్ లో ఉంది.
హుజురాబాద్ లో ఇప్పటి వరకు 9 రౌండ్లు పూర్తయ్యాయి. అక్కడ 22 రౌండ్లు ఉన్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి లీడ్ లో ఉన్నారు. 10751 ఓట్ల మెజారిటీతో లీడ్ లో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఒడితల ప్రణవ్, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఓటమి దిశగా ఉన్నారు. ఈటలకు ఇప్పటి వరకు 22 వేల ఓట్లు పడ్డాయి. ఇక.. కరీంనగర్ లో బండి సంజయ్ ఓటమి దిశగా ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ కు 39114 ఓట్లు పడ్డాయి. 6349 ఓట్ల మెజారిటీతో గంగుల ఉన్నారు. ఇప్పటి వరకు 10 రౌండ్లు ముగిశాయి. మొత్తం 25 రౌండ్లు ఉన్నాయి. బండి సంజయ్ కి ఇప్పటి వరకు 32765 ఓట్లు పోలయ్యాయి.
దుబ్బాక నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి లీడ్ లో ఉన్నారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఓటమి దిశలో ఉన్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డి 38393 ఓట్ల మెజారిటీతో లీడ్ లో ఉండగా, బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకి 28 వేల ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డికి 15898 ఓట్లు పడ్డాయి. దుబ్బాకలో మొత్తం 19 రౌండ్లు ఉండగా 12 రౌండ్లు ముగిశాయి. కోరుట్లలో ధర్మపురి అర్వింద్ వెనుకంజలో ఉన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్ 45 వేల ఓట్లు సాధించి 7859 ఓట్ల మెజారిటీతో ఉన్నారు. ధర్మపురి అర్వింద్ కు 37 వేల ఓట్లు వచ్చాయి. ఇక్కడ మొత్తం 19 రౌండ్లు ఉండగా ఇప్పటికే 12 రౌండ్లు పూర్తయ్యాయి.