Womens : మహిళలకి అదిరిపోయే శుభవార్త చెప్పిన సర్కార్.. రూ.2500లు నెల నెల..!
ప్రధానాంశాలు:
Womens : మహిళలకి అదిరిపోయే శుభవార్త చెప్పిన తెలంగాణ సర్కార్.. రూ.2500లు నెల నెల..!
Womens : ఎన్నికలకు ముందు కాంగ్రెస్ Congress ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో కొన్ని ఇప్పటికే అమలులోకి వచ్చాయి. అయితే అత్యంత కీలకమైన మహిళలకు నెలకు ₹2,500 ఆర్థిక సహాయం పథకం ఇంకా అమలుకాలేదు. ఈ పథకం కోసం మహిళలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Womens : మహిళలకి అదిరిపోయే శుభవార్త చెప్పిన సర్కార్.. రూ.2500లు నెల నెల..!
Womens మహిళలకి గుడ్ న్యూస్..
తాజాగా సీఎం రేవంత్ రెడ్డి Revanth Reddyమీడియాతో మాట్లాడుతూ “త్వరలోనే మహాలక్ష్మీ పథకం కింద మహిళల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తాం” అని ప్రకటించారు. దీంతో మార్చి 8న ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. మార్చి 8, అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మహిళలకు నెలకు ₹2,500 ఆర్థిక సహాయంతో పాటు మరికొన్ని పథకాల అమలు ప్రారంభం కానుంది.
దీంతో రాష్ట్రంలోని మహిళలు Womens ఆర్థికంగా భరోసా లభించనుంది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే మహిళల కోసం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. మహాలక్ష్మీ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తోంది. అంతేకాదు, ₹500కే గ్యాస్ సిలిండర్ అందిస్తోంది. ఇప్పుడు మరికొన్ని పథకాల అమలు కూడా సిద్ధమవుతున్నాయి.