Rythu Bharosa : రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త.. ఒకేసారి 15 వేలు ఖాతాల్లోకి..!
Rythu Bharosa : అన్నదాతలకు తెలంగాణా లోని కాంగ్రెస్ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. రైతులకు మరో శుభవార్త ప్రకటించింది ప్రభుత్వం. ఒకేసారి ఏకకాలంలో 15 వేల రూపాయలు బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేయబడతాయి. ఏంటి ఒకేసారి రైతుల ఖాతాల్లోకి అంత మొత్తమా అదెలా అంటే ఈ వార్త చదవాల్సిందే. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే రైతుల రుణాలను మాఫీ చేస్తూ వస్తుంది. ముందు 1 లక్ష వరకు రైతు మాఫీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత 1.5 లక్షల దాకా రుణ మాఫీ చేశారు. ఆగష్టు 15 కల్లా 2 లక్షల దాకా రుణ మాఫీ చేస్తారని చెబుతూ వచ్చారు. 3వ విడత రుణ మాఫీ పై ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Rythu Bharosa రైతులకు 15 వేల మొత్తం ఎలా ఇస్తారు..
ఐతే 2 లక్షల రుణ మాఫీ పక్కన పెడితే ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను చేస్తూ వచ్చింది. రుణ మాఫీ పై మాత్రం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. దీని వల్ల చాలామంది రైతులకు ఊరట లభించింది. రైతు హామీల కోసం రైతులు ఎదురుచూస్తున్న టైం లొ పెట్టుబడి సాయం కోసం ప్రభుత్వం రైతు భరోసా సొమ్ము అందించాల్సి ఉంది. ఐతే అది కాస్త లేట్ అవుతూ వచ్చింది. ప్రభుత్వం రైతులకు 15000 రూపాయలు ఇవ్వనున్నట్టు నివేదిక వచ్చింది. ఐతే రెండు విడతల్లో రైతు భరోసా ఇవ్వలని భవించినా అది జరగలేదు.
కానీ ఈసారి రైతు భరోసాని కూడా పూర్తిగా రిలీజ్ చేసేలా పథకం త్వరలో విధి విధానాలు చేస్తారని తెలుస్తుంది. దీనిపై ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేయాల్సి ఉంది. రైతులకు 15వేలు ఇచ్చేందుకు రైతు భరోసా గురించి ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన కోసం రైతులు ఎదురుచూస్తున్నారు.