Telangana : సంక్షేమ పథకాల అమలులో దూసుకుపోతున్న తెలంగాణ : మాజీ ఎంపీ కే.కేశవరావు
ప్రధానాంశాలు:
Telangana : సంక్షేమ పథకాల అమలులో దూసుకుపోతున్న తెలంగాణ
Telangana : ఘటకేసర్ మండలం గణపురం గ్రామంలో రైతు భరోసా rythu bharosa , ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల ప్రారంభం .. ముఖ్య అతిధులుగా హాజరైన ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు, మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతం పోట్రూ,నియోజకవర్గ ఇంచార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్ Telangana Govt తెలంగాణ రాష్ట్ర సంక్షేమ పథకాల అమలులో దూసుకుపోతుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మాజీ ఎంపీ కే.కేశవరావు అన్నారు.
ఆదివారం నాడు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసి ప్రవేశపెట్టిన రైతు భరోసా,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల అమలు ప్రక్రియను మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతం పోట్రూ,మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్,మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి, ఘట్కేసర్ మున్సిపాలిటీ ఛైర్మెన్ మల్లి పావని జంగయ్య యాదవ్,లతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమంలో ముందు వరసలో ఉందని అన్నారు.
మేడ్చల్ నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా కార్యకర్తలు చోరవ తీసుకోవాలని కోరారు, ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గం బి బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, ఘట్కేసర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మామిడ్ల ముత్యాల్ యాదవ్,ఘనపూర్ గ్రామం మాజీ సర్పంచ్ గోపాల్ రెడ్డి, కౌన్సిలర్లు ఘట్కేసర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు