KTR : ఏదీ సక్కగ చెప్పవా.. ఈ డొంకతిరుగుడు సమాధానాలు ఎందుకు కేటీఆర్?
KTR : మనం చెప్పేది అబద్ధం అయినా నిజం అయినా.. ఒకరికి సమాధానం చెప్పాలంటే అది అబద్ధం అయినా నిజం అన్నంతగా నమ్మించాలంటే మాట్లాడే చాతుర్యం ఉండాలి. వాళ్లను నమ్మించే సత్తా మనదగ్గర ఉండాలి. గట్టిగా మాట్లాడగలగాలి. అబద్ధాన్ని నిజం అనిపించేలా చాకచక్యంగా మాట్లాడాలి. అప్పుడే ఎదుటి వాడు మనం ఏది చెప్పినా నిజం అనే అనుకుంటాడు. అబద్ధం అనుకోడు. ఆ కాన్ఫిడెన్స్ ఉంటేనే ఏ చెప్పినా వింటారు. అలాంటి ధైర్యం ఉన్న వ్యక్తి మంత్రి కేటీఆర్.
అవును.. ఉన్నది లేనట్టుగా.. లేనిది ఉన్నట్టుగా.. ఆయన మాట్లాడే విధానం చూస్తే అలాగే ఉంటుంది అంటున్నారు జనాలు. తండ్రికి తగ్గ తనయుడిగా కాదు.. తండ్రిని మించిన తనయుడిగా కేటీఆర్ చరిత్రకెక్కారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడిన తీరు చూస్తే అలాగే ఉందని ప్రజలు అంటున్నారు. గ్రామ పంచాయతీలకు నిధులు రావడం లేదని.. పనులు చేసినా ఇప్పటి వరకు బిల్లులు ఇవ్వకపోవడం ఏంటని కాంగ్రెస్ సభ్యులు ప్రశ్నిస్తే దానికి ఆయన చెప్పిన సమాధానం ఎలా ఉందో తెలుసా? అన్నీ డొంకతిరుగుడు సమాధానాలే.గ్రామాల్లో పనులే జరగడం లేదని భట్టీ అంటున్నారు. పనులు జరగనప్పుడు అసలు బిల్లులు ఎక్కడి నుంచి వచ్చాయి. భట్టి విక్రమార్క గారు పాద యాత్ర చేసి అలసిపోయారు. అన్న మీరు రెస్టు తీసుకోండి.. అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. మెయిన్ టాపిక్ ను డైవర్ట్ చేశారు కేటీఆర్
KTR : కేటీఆర్ ప్రసంగం మొత్తం హేళనే
. ఇలా.. ప్రతి విషయంలోనూ కేటీఆర్ అవహేళన చేస్తూ మాట్లాడటం స్పష్టంగా కనిపిస్తోంది. అసలు ఏకగ్రీవమైన పంచాయతీలకు ప్రభుత్వం ముందు ప్రకటించినట్టుగా నిధులు విడుదల చేసిందా అని అడిగిన ప్రశ్నకు కేటీఆర్ నుంచి సమాధానం మాత్రం రాలేదు. వామ్మో.. ఇలాంటి మాటలు మాట్లాడటం కేసీఆర్ తర్వాత కేటీఆర్ కే చెల్లుబాటు అవుతోంది అంటూ రాజకీయ విశ్లేషకులు ముక్కు మీద వేలేసుకుంటున్నారు.