School Holidays : ఈ వార్త విని ఎగిరి గంతేస్తున్న పిల్లలు.. విద్యార్ధులకి సెలవులే సెలవులు.. .!
ప్రధానాంశాలు:
School Holidays : విద్యార్ధులకి సెలవులే సెలవులు.. ఈ వార్త విని ఎగిరి గంతేస్తున్న పిల్లలు..!
School Holidays : సాధారణంగా స్కూల్స్‌కి సెలవులు వస్తే పిల్లల ఆనందం అంతా ఇంతా కాదు. రోజు స్కూల్‌కి వెళ్లి టైర్డ్ అయ్యే విద్యార్ధులు ఒక్కరోజు సెలవు వచ్చిన బాగుండు అనుకుంటారు. అయితే ఇప్పుడు ఆగస్ట్‌లో విద్యార్ధులకి సెలవులే సెలవులు. ఆగస్టు నెలలో విద్యార్థులకు చాలా రోజుల పాటు సెలవులు వస్తున్నాయి. రెండవ శనివారం, స్వాతంత్య్ర దినోత్సవం ఇలా పలు పండగలు, ఆదివారాలు అన్నీ కలిపి మొత్తం ఈ నెలలో 9 రోజుల పాటు పాఠశాలలు మూతపడనున్నాయి. ఆగస్టు నుంచి పండగలు మొదలవుతాయి. వీటికి తోడు రెండో శనివారం, ఆదివారాలు కలిసి.. విద్యార్థులకు భారీగా హాలీడేస్ రానున్నాయి. ఇదిలా ఉండగా.. త్వరలోనే విద్యార్థులకు వరుసగా 5 రోజులు సెలవులు రానున్నాయి.
School Holidays వరుస సెలవులు
ఆగస్టు 4 ఆదివారం, ఆగస్ట్ 10.. రెండో శనివారం, 11 ఆదివారం. వరుసగా రెండు రోజులు సెలవులు రానున్నాయి. ఆ తర్వాత వెంటనే ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం, ఆగస్టు 16న వరలక్ష్మీ వ్రతం. ఈ రెండు రోజులు విద్యార్థులకు వరుస సెలవులు రానున్నాయి. అలానే ఆగస్టు 18 ఆదివారం, 19 రాఖీ పౌర్ణమి సందర్భంగా మరోసారి వరుసగా రెండు రోజులు సెలవులు రానున్నాయి. మధ్యలో ఆగస్టు 17 ఒక్క రోజు హాలీడే తీసుకుంటే..ఆగస్టు 15, 16, 18, 19 వరుస సెలవులు రానున్నాయి.ఆగస్టు 9వ తేదీన అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆ రోజున సెలవు ప్రకటించాలని ఆదివాసీ నేతలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఇప్పటికే కొన్ని ఆదివాసీ రాష్ట్రాలు ఇప్పటికే ఆగస్టు 9వ తేదీన సెలవు ప్రకటించాయి. ఆ రోజున ఆదివాసీలకు సంబంధించిన సాంస్కృతిక, సంప్రదాయ కార్యక్రమాలు చర్చించుకోవడానికి వారు అవకాశం కల్పిస్తున్నారు. తెలంగాణలోనూ సెలవు ఇవ్వండి అని సీఎంకు విజ్ఞప్తి చేశారు. ఒక వేళ 9వ తేదీన కూడా సెలవు ప్రకటిస్తే మొత్తం ఈనెలలో 10 రోజుల పాటు విద్యార్థులకు పండగే. ఇకపోతే రాష్ట్రం లేదా ప్రాంతం ఆధారంగా సెలవుల్లో మార్పులు ఉండొచ్చు. అందువల్ల హాలిడేస్ గురించి సంబంధిత స్కూల్ లేదా కాలేజ్ హాలిడే షెడ్యూల్ చెక్ చేసుకోవడం ఉత్తమం.