MLA Bhasker Rao: అలాగైతే పథకాలు తీసుకోవద్దు మిర్యాలగూడ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు..!!

Advertisement

MLA Bhasker Rao: మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విషయంలోకి వెళ్తే మంగళవారం ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన దామచర్ల మండలంలోని నరసాపూర్ గ్రామస్తులపై సీరియస్ వ్యాఖ్యలు చేశారు. నాకు వ్యతిరేకంగా మాట్లాడేవారు కేసీఆర్ పథకాలు తీసుకోవద్దంటూ మండిపడ్డారు. అన్నం పెట్టే వారికి సున్నం పెడుతున్నారంటూ గ్రామస్తులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు నా సంగతి మీకు తెలియదు అందరినీ డాన్స్ చేయిస్తాను అంటూ హెచ్చరించారు.

తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత ఏ విధంగా అభివృద్ధి చెందిందో నర్సాపూర్ ప్రజలు ఆలోచించాలని కోరారు. మీరు ఆలోచన చేయకపోతే మీకు మీరే ఇబ్బందులు ఎదుర్కొంటారు.. మాకేమీ ఇబ్బంది ఉండదు అని వ్యాఖ్యానించారు. తనకు వ్యతిరేకంగా మాట్లాడేవారు కేసీఆర్ వేసిన రోడ్లపై నడవవద్దని.. కెసిఆర్ ప్రభుత్వం ఇస్తున్న రైతుబంధు, టెన్షన్ లు, కల్యాణ లక్ష్మి పథకాలు తీసుకోవద్దని హెచ్చరించారు.

Advertisement
then don't take the schemes Miryalaguda MLA's controversial comments
then don’t take the schemes Miryalaguda MLA’s controversial comments

ఒకవేళ పథకాలన్నీ తీసుకొని మాకు నచ్చిన డాన్స్ చేస్తామంటే నేను కూడా డాన్స్ చేపిస్తా.. అంటూ వార్నింగ్ ఇచ్చారు. మర్యాదగా ఉంటే బాగుంటది లేకపోతే ఏ విధంగా డాన్స్ చేపించాలో… ఐదు నిమిషాలు చేపిస్తానంటూ మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావు మండిపడ్డారు. దీంతో ఎమ్మెల్యే భాస్కరరావు వ్యాఖ్యలపై నర్సాపూర్ ప్రజలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement
Advertisement