Jagadish Reddy : మీడియా ముసుగులో దాడి చేస్తే కేసీఆర్ అభిమానులు చూస్తూ ఊరుకోరు : జగదీశ్ రెడ్డి
ప్రధానాంశాలు:
Jagadish Reddy : మీడియా ముసుగులో దాడి చేస్తే కేసీఆర్ అభిమానులు చూస్తూ ఊరుకోరు : జగదీశ్ రెడ్డి
ఆ మూడు మీడియా హౌస్ లు కాదు స్లాటర్ హౌస్‌లు - జగదీశ్ రెడ్డి
Jagadish Reddy : భారతీయ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీకి చెందిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి యెల్లో మీడియాపై తీవ్ర విమర్శలు చేశారు. మహా న్యూస్ చానల్ కార్యాలయంపై జరిగిన సంఘటనపై స్పందిస్తూ, అది దాడి కాదు నిరసన మాత్రమేనని స్పష్టం చేశారు. మా సహనం పరీక్షించొద్దు. మీరు ఏ పోలీసులూ రక్షించలేరు. ఇంకో రెండు మూడు ఛానళ్ల పని మేము త్వరలోనే చూస్తాం” అంటూ హెచ్చరికలు చేశారు.

Jagadish Reddy : మీడియా ముసుగులో దాడి చేస్తే కేసీఆర్ అభిమానులు చూస్తూ ఊరుకోరు : జగదీశ్ రెడ్డి
Jagadish Reddy : తెలంగాణాను ఆంధ్ర నుంచి విడదీశారనే అక్కసుతోనే కేసీఆర్‌పై కుతంత్రాలు – జగదీశ్ రెడ్డి
“మీడియా పేరుతో కొందరు వ్యక్తిత్వ దాడులు పూనుకుంటున్నారు. ఇవి నిజానికి మీడియా హౌస్‌లు కావు.. స్లాటర్ హౌస్‌లు” అంటూ జగదీష్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “మీ బలుపు ఏంది? ఎవడ్ని చూసుకొని మీకు ఇంత అహంకారం? మేము మీడియా మా ఇష్టం వచ్చినట్లు రాస్తాం అంటే ఎవడు ఊరుకుంటాడు?” అంటూ ఆయన ప్రశ్నించారు. తన పరంగా మాత్రం దాడి మొదలయ్యిందని అనుకోవద్దంటూ వ్యాఖ్యానించారు.
“కేసీఆర్ తెలంగాణను ఆంధ్రా నుంచి విడదీశాడన్న కోపంతోనే ఈ దాడులు జరుగుతున్నాయి. గత సంవత్సరం నుంచే కొన్ని మీడియా సంస్థలు ప్రభుత్వాన్ని మార్గనిర్దేశం చేస్తున్నాయంటూ చెంచా గాళ్లుగా మారిపోయాయి” అని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని విమర్శించడంలో ఒక హద్దు ఉండాలన్నారు. యెల్లో మీడియా చేసిన అన్యాయానికి సమాధానం చెబుతామని, ప్రజల్లో చైతన్యం తెచ్చే పక్షపాత రహిత మీడియాను మాత్రం తాము గౌరవిస్తామని స్పష్టం చేశారు.
కేసీఆర్ క్షమించినా యెల్లో మీడియాను మేము వదిలిపెట్టం
నిన్న మహా న్యూస్ చానల్ మీద జరిగింది దాడి కాదు నిరసన మాత్రమే
ఇంకో రెండు, మూడు ఉన్నాయి.. వాటి పని కూడా చేస్తాం.. మా దాడి వేరే విధంగా ఉంటది.. ఏ పోలీసులు కూడా మిమ్మల్ని కాపాడలేరు
మీ బలుపు ఏంది.. మీ అహంకారం ఏంది
ఎవడ్ని చూసుకొని… pic.twitter.com/Z0EeJNySgw
— Telugu Scribe (@TeluguScribe) June 29, 2025