BJP Leaders : కనుపడుటలేదు : ఈ ముగ్గురు నేతలూ అండర్ గ్రౌండ్ కి వెళ్లి పోయారా?
BJP Leaders : ఏ పార్టీ అయినా సరే.. ఆ పార్టీకి చెందిన పెద్ద కావచ్చు.. ఆ పార్టీలో కీలకంగా వ్యవహరించే నాయకుడు కావచ్చు.. పదవిలో ఉన్న నాయకుడు కావచ్చు.. ఎవరి పర్యటన ఎక్కడ ఉన్నా.. అక్కడ ఆ పర్యటనకు ఆ ప్రాంత నేతలంతా హాజరవుతారు. ఆ నేతతో మాట్లాడుతారు. పర్యటన ఏర్పాట్లు చూస్తారు. అంతే కానీ.. ఎవరు వస్తే మాకేంటి అని పట్టించుకోకుండా ఉండరు. ఆ నేతను కలవకుండా ఉండరు. చోటా మోటా నాయకుడు వస్తేనే హడావుడి చేస్తారు. అలాంటిది ఏకంగా దేశానికి ప్రధాని వస్తుంటే ఆ మాత్రం హడావుడి ఉండదా చెప్పండి.
మరి.. ప్రధాన మంత్రి అంతటి వ్యక్తి ఒక జిల్లాకు వస్తున్నారు అంటే.. ఆ జిల్లా నాయకులు కావచ్చు.. ఆ రాష్ట్రానికి చెందిన నాయకులు కూడా అలర్ట్ అవుతారు. ఆయన పర్యటనలో భాగం అవుతారు. కానీ.. ప్రధాని నరేంద్ర మోదీ వరంగల్ పర్యటనలో ముగ్గురు బీజేపీ నేతలు మాత్రం గైర్హాజరయ్యారు. నిజానికి వాళ్లు సీనియర్లే కానీ.. ప్రధాని మోదీ పర్యటనలో ఎక్కడా కనిపించలేదు. దీంతో ఆ టాపిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.విజయశాంతి ఎంత పెద్ద లీడరో అందరికీ తెలుసు. అలాగే మాజీ ఎంపీ వివేక్ కూడా సీనియర్ నేతే. అలాగే.. చంద్రశేఖర్ కూడా. ఈ ముగ్గురూ పార్టీ అధినాయకత్వంపై ఎందుకో గుర్రుగా ఉన్నట్టు అనిపిస్తోంది. ఆ మధ్య గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెన్షన్ పై ఒకసారి పునరాలోచించుకోవాలని ఏకంగా బీజేపీ హైకమాండ్ కు విజయశాంతి ట్వీట్ పెట్టారు.
BJP Leaders : విజయశాంతి, వివేక్, చంద్రశేఖర్ ఈ ముగ్గురూ మిస్సింగ్
అలా విజయశాంతిని బీజేపీ లైట్ తీసుకుందా అనే అనుమానం తలెత్తుతోంది. మరోవైపు వివేక్, చంద్రశేఖర్ ఈ ఇద్దరూ కాంగ్రెస్ పార్టీతో టచ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. అంటే.. ఈ ముగ్గురు బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే.. వీళ్లు కావాలని ప్రధాని పర్యటనకు హాజరు కాలేదు అనే వార్తలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హల్ చల్ చేస్తున్నాయి.