Koppula Narasimha Reddy : డివిజన్ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు కొనసాగుతాం : కొప్పుల నర్సింహ్మా రెడ్డి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Koppula Narasimha Reddy : డివిజన్ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు కొనసాగుతాం : కొప్పుల నర్సింహ్మా రెడ్డి

 Authored By ramu | The Telugu News | Updated on :19 April 2025,11:58 pm

ప్రధానాంశాలు:

  •  Koppula Narasimha Reddy : డివిజన్ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు కొనసాగుతాం : కొప్పుల నర్సింహ్మా రెడ్డి

Koppula Narasimha Reddy : మన్సూరాబాద్ డివిజన్ హయత్ నగర్ ప్రాంతంలోని T.Nagar కాలనీ రోడ్డు నెం:-3లో సుమారు 11.00 లక్షలు వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న సీ.సీ రోడ్డు పనులను GHMC డిప్యూటీ ఫ్లోర్ లీడర్,స్థానిక కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి గారు కాలనీ సంక్షేమ సభ్యులతో కలిసి టెంకాయలు కొట్టి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ “ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని మేము అభివృద్ధి పనులను చేపడుతున్నామని అన్నారు.

Koppula Narasimha Reddy డివిజన్ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు కొనసాగుతాం కొప్పుల నర్సింహ్మా రెడ్డి

Koppula Narasimha Reddy : డివిజన్ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు కొనసాగుతాం : కొప్పుల నర్సింహ్మా రెడ్డి

Koppula Narasimha Reddy  డివిజన్ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు కొనసాగుతాం — GHMC డిప్యూటీ ఫ్లోర్ లీడర్,కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి

T.Nagar కాలనీ సి.సి రోడ్డు పనులకు మూడుసార్లు టెండర్లు పూర్తయిన తర్వాత మళ్లీ క్యాన్సల్ కావడంతో, మళ్లీ దాన్ని ప్రత్యేకంగా జోనల్ కమిషనర్ గారి దిశకు తీసుకెళ్లి టెండర్ వేయించి పనులను చేపట్టడం జరుగుతుందని తెలియజేశారు. అదేవిధంగా జరుగుతున్న సీ.సీ పనులలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ సరైన లెవెల్స్ సమకూర్చి భవిష్యత్తులో ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేలా పనులు పూర్తి చేయాలని అధికారులకు మరియు కాంట్రాక్టర్ కు తెలియజేశారు.

ఇంకా డివిజన్లో మరో నాలుగు నుండి ఐదు నెలలులో టెండర్ అయ్యి మిగిలిన పెండింగ్ పనులుకు మరియు నూతనంగా చేపట్టబోయే సి.సి రోడ్డు,భూగర్భ డ్రైనేజీ మరియు కొన్ని పైలెట్ ప్రాజెక్టు కింద శాంక్షన్ అయినటువంటి పనులకు 4 నుండి 5 కోట్ల వరకు నిధులు ప్రత్యేకంగా మేయర్ గారు,కమిషనర్ గారు మరయు ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ గారు స్వయంగా పరిశీలించి చేపట్టబోతున్న పనులను తొందర్లోనే శుభవార్త అందుకొని పనులను ప్రారంభించుకుంటామని కాలనీ సంక్షేమ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సభ్యులు ఎం.వి శ్రీనివాస రావు, భాస్కర్, మల్లారెడ్డి,శ్రీనివాస్ రెడ్డి,సతీష్,నిరంజన్ రావు,యాదగిరి రెడ్డి మరయు బీజేపీ నాయకులు కడారి యాదగిరి,ప్రమోద్ రెడ్డి,శ్రీధర్ గౌడ్,నవీన్ రావు,శ్యాంసుందర్ రెడ్డి,ఎల్లారెడ్డి,వెంకటరమణ గౌడ్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది