Koppula Narasimha Reddy : అభివృద్ధి కొరకు ఎన్ని నిధులైన తీసుకొస్తా : కొప్పుల నర్సింహ్మా రెడ్డి
ప్రధానాంశాలు:
అభివృద్ధి కొరకు ఎన్ని నిధులైన తీసుకొస్తా GHMC డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి
Koppula Narasimha Reddy : మన్సూరాబాద్ డివిజన్ హయత్ నగర్ వినాయక్ నగర్ కాలనీలో గత నెల రోజుల క్రితం చేసిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పునరుద్ధరణ పనులకు పాడైన రోడ్డు వలన కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారని మరయు బోనాల పండుగ సందర్భంగా షార్ట్ టెండర్ తో సుమారు వ్యయం రూ:- 14.00 లక్షలతో కూడిన సి.సి రోడ్ అభివృద్ధి పనులను GHMC డిప్యూటీ ఫ్లోర్ లీడర్,స్థానిక కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి గారు జోనల్ కమిషనర్ గారి సహకారంతో సాంక్షన్ చేయించడం జరిగింది.

Koppula Narasimha Reddy : అభివృద్ధి కొరకు ఎన్ని నిధులైన తీసుకొస్తా : కొప్పుల నర్సింహ్మా రెడ్డి
Koppula Narasimha Reddy ఈ సందర్భంగా కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి గారు మాట్లాడుతూ..
గత రెండు వారాల నుంచి పడుతున్న వర్షం కారణంగా ఇంకా గుంతలు పడి నడవలేని స్థితిలో ఉన్న రోడ్డు వలన కాలనీవాసులు ఇబ్బందులకు గురవుతున్నారని మరయు పక్కనే ఉన్న పోచమ్మ గుడికి అధిక సంఖ్యలో బోనాలు సమర్పించేందుకు భక్తులు వస్తుంటారని జోనల్ కమిషనర్ శ్రీ హేమంత్ కేశవ్ పాటిల్ గారి దృష్టికి తీసుకెళ్లడంతో షార్ట్ టెండర్ వేయించి వెంటనే శాంక్షన్ ఇవ్వడం జరిగిందని అదేవిధంగా వారు బోనాల పండుగ సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు సాంక్షన్ ఇచ్చినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
సరైన లెవెల్స్ పాటిస్తూ,రోడ్డుకు ఇరువైపులా రోడ్డుపైకి ఉన్న ర్యాంపులు,చెట్లు పెట్టే గోడలను తొలగించి విశాలంగా ఉండే విధంగా రోడ్డు నిర్మించాలని అతితొందరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు మరయు గుత్తేందారులుకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి అధికారులు A.E సప్న,W.I సీతారాం మరియు కాలనీవాసులు రమణారెడ్డి, కొండల్ రెడ్డి,వెంకటరెడ్డి,బుచ్చిరెడ్డి,భాను గౌడ్, సురేష్,సోమిరెడ్డి,ప్రముఖ రెడ్డి, M.బాల్ రెడ్డి,S.బాల్ రెడ్డి,దామోదర్ రెడ్డి,శేఖర్ రెడ్డి మరియు బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.