KCR Family : కేసీఆర్ కుటుంబంలో ఏం జరుగుతోంది..?? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

KCR Family : కేసీఆర్ కుటుంబంలో ఏం జరుగుతోంది..??

KCR Family : బీఆర్ఎస్ ఫ్యామిలీలో విభేదాలు అంతకంతకు పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. దీనికి వరుసగా జరుగుతున్న పరిణామాలే కారణం. కేటీఆర్ లోకసభ నియోజకవర్గాల సమీక్షలకు హాజరు కావడం లేదు. హరీష్ రావు చేతుల మీదుగా నడుస్తున్నాయి. దీనికి కారణం కేటీఆర్ గొంతు నొప్పి అని చెబుతున్నారు. కానీ లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం పై కేసీఆర్ ఆలోచనలతో కేటీఆర్ ఏకీభవించలేకపోతున్నారని అంటున్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి వెళ్లాలని కేటీఆర్ అనుకుంటున్నారు. ఈ […]

 Authored By anusha | The Telugu News | Updated on :8 January 2024,8:20 pm

KCR Family : బీఆర్ఎస్ ఫ్యామిలీలో విభేదాలు అంతకంతకు పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. దీనికి వరుసగా జరుగుతున్న పరిణామాలే కారణం. కేటీఆర్ లోకసభ నియోజకవర్గాల సమీక్షలకు హాజరు కావడం లేదు. హరీష్ రావు చేతుల మీదుగా నడుస్తున్నాయి. దీనికి కారణం కేటీఆర్ గొంతు నొప్పి అని చెబుతున్నారు. కానీ లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం పై కేసీఆర్ ఆలోచనలతో కేటీఆర్ ఏకీభవించలేకపోతున్నారని అంటున్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి వెళ్లాలని కేటీఆర్ అనుకుంటున్నారు. ఈ మేరకు కేసిఆర్ అనుమతి లేకుండానే తనకు బాగా దగ్గరైన బీజేపీ నేత గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ద్వారా బీజేపీ హై కమాండ్ కు పొత్తుల ప్రతిపాదన తీసుకెళ్లారని స‌మాచారం. ఈ విషయం తెలిసిన కేసీఆర్ మండిపడ్డారని, బీజేపీతో పైకి కనిపించని రాజకీయ స్నేహం ఓకే కానీ నేరుగా అంటే పార్టీ నేలకు దిగడమే అని, తనకు తెలియకుండా పొత్తు ప్రతిపాదనలు ఎందుకు చేసినట్లు అని కేటీఆర్ పై కేసీఆర్ ఫైర్ అయ్యారని చెబుతున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ఆత్మహత్య లాంటిదని కేసీఆర్ చెబుతున్నారు. కేటీఆర్ మాత్రం పొత్తు పెట్టుకోకపోతే అంతకంటే ముందే అదృశ్యం అయిపోతామని ఆందోళన చెందుతున్నారని అంటున్నారు. కేంద్ర రాష్ట్రాలు అధికారం ఉన్న జాతీయ పార్టీలను ఎదుర్కోవడం అంత సులువు కాదని, లోక్‌స‌భ‌ ఎన్నికల్లో తేడా వస్తే పార్టీ నీ కాపాడుకోవడం కష్టమని కేటీఆర్ అనుకుంటున్నారు. ఇప్పుడు పార్టీ భవిష్యత్తును కాపాడుకుంటేనే కేటీఆర్ రాజకీయ భవిష్యత్తును కాపాడుకున్నట్లు అవుతుంది. అందుకే ఆయనే చొరవ తీసుకుంటున్నారు.

కానీ కేసీఆర్ కి మాత్రం బీజేపీతో పొత్తు వద్దు అనుకుంటున్నారు. ఈ వ్యవహారంలో కేటీఆర్ అసంతృప్తికి గురి కావడం వల్ల లోక్సభ నియోజకవర్గాల సమీక్షలకు దూరంగా ఉన్నారని ప్రచారం జరుగుతుంది. ఇటీవల జగన్ కేసీఆర్ ను పరామర్శించడానికి వచ్చినప్పుడు కేటీఆర్ చాలా డల్ గా ఉన్నారు. తర్వాత నుంచి ఆయన నియోజకవర్గాల సమీక్షలకు హాజరు కావడం లేదు. గొంతు నొప్పి కారణం చెప్పి సైలెంట్ గా ఉంటున్నారు. అంతేకాదు తాను ఎంపీగా పోటీ చేస్తానని సంకేతాలు పంపారు. కేటీఆర్ లోక్‌స‌భ‌కు పోటీ చేసేందుకు కసరత్తు ప్రారంభించినట్లుగా బీఆర్ఎస్ వర్గాలు మీడియాకు లీకులు ఇచ్చాయి. కేసీఆర్ ఇప్పటికే సికింద్రాబాద్ లేదా మల్కాజిగిరి స్థానాలపై దృష్టి పెట్టినట్లుగా చెబుతున్నారు.ఈ రెండిట్లోనూ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మంచి ఫలితాలను సాధించింది. దీంతో పోటీ చేస్తే విజయం ఖాయమని అంచనా వేస్తున్నారు. కానీ పార్లమెంట్ ఎన్నికల ఓటు వేరేలా ఉంటుంది. ఈ రెండు చోట్ల బీఆర్ఎస్ ఇంతవరకు గెలవలేదు. సికింద్రాబాద్ లో ఎప్పుడు బీఆర్ఎస్ గెలవలేదు కానీ కేటీఆర్ గెలిచేందుకు ఆలోచిస్తున్నారు. కేటీఆర్ లోక్‌స‌భ‌కు పోటీ చేస్తే కేసీఆర్ లేదా కవిత ఇద్దరిలో ఒకరు విరమించుకోవాల్సి వస్తుందన్న అభిప్రాయం కనిపిస్తుంది.

కేసీఆర్ ప్రతిపక్షనేతగా ఉండేందుకు ఇష్టపడటం లేదని చెబుతున్నారు. అందుకే మెదక్ నుంచి పోటీ చేస్తారని అంటున్నారు. ఇక కవిత ఎప్పటిలాగే నిజామాబాద్ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. మరి కేటీఆర్ పోటీ చేస్తే అందరూ లోక్ సభ కే పోటీ చేసినట్లు అవుతుంది.కేటీఆర్ తెలంగాణ రాజకీయాలను చూసుకుంటే కవిత జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టేవారు. అనూహ్యంగా కేటీఆర్ లోక్సభకు పోటీ చేస్తారని ప్రచారం ఫ్యామిలీ పాలిటిక్స్ అని అంచనా వేస్తున్నారు. వీటన్నింటికీ బలం చేకూరేలా హరీష్ రావు కొత్త ప్రకటన చేశారు. కేసీఆర్ వేగంగా కోలుకుంటున్నారని, ఫిబ్రవరి నుంచి తెలంగాణ భవన్ కు వచ్చి రాష్ట్రస్థాయి కార్యక్రమాలను చేపట్టడమే కాదు జిల్లా పర్యటనలు కూడా చేస్తారని అంటున్నారు. అంటే మళ్ళీ కేసీఆర్ పూర్తిస్థాయిలో యాక్టివ్ అవుతారని కేటీఆర్ ప్రాధాన్యత ఉండదని ఆయన చెప్పినట్లుగా అయింది. ఇదంతా బీఆర్ఎస్ శ్రేణులను గందరగోళపరుస్తుంది. ఓటమి తర్వాత ఇలాంటి సమస్యలు వస్తాయని తట్టుకొని నిలబడకపోతే కష్టమని వాదన ఆ పార్టీ వర్గాల్లో వినిపిస్తుంది.

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది