Bandi Sanjay : ఆ మూడు గంటలే బండి సంజయ్ పాలిట శాపంగా మారాయా? గంగుల అందుకే గెలిచారా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bandi Sanjay : ఆ మూడు గంటలే బండి సంజయ్ పాలిట శాపంగా మారాయా? గంగుల అందుకే గెలిచారా?

 Authored By kranthi | The Telugu News | Updated on :10 December 2023,9:30 pm

ప్రధానాంశాలు:

  •  గంగుల గెలవడానికి, బండి ఓడిపోవడానికి కారణం అదేనా?

  •  ఆ చివరి మూడు గంటలు ఏం జరిగింది?

  •  మైనారిటీలకు ఓటుకు రూ.10 వేల చొప్పున పంచారా?

Bandi Sanjay : తెలంగాణలో కాంగ్రెస్ రాజ్యం వచ్చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ తప్పుకొని రేవంత్ రెడ్డి పీఠం అధిరోహించారు. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు. అయితే.. ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కానీ.. బీజేపీ కానీ.. కాంగ్రెస్ కానీ ఎక్కడ గెలవాలో అక్కడ గెలవలేదు. కొన్ని సీట్లు గెలవాల్సినవి కానీ జస్ట్ లో మిస్ అయ్యాయి. అలా కరీంనగర్ గడ్డ మీద కూడా బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ని ఓడించి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గంగుల కమలాకర్ నాలుగోసారి విజయం సాధించారు. నిజానికి కరీంనగర్ లో గంగులపై చాలా వ్యతిరేకత ఉన్నది. దీంతో ఆయన ఈసారి పక్కాగా ఓడిపోతారని అందరూ అనుకున్నారు. సర్వేలు కూడా అవే చెప్పాయి. కానీ.. తీరా చూస్తే అక్కడ సీన్ రివర్స్ అయింది. బండి సంజయ్ ఓడిపోయి గంగుల కమలాకర్ గెలిచారు. గంగుల కరీంనగర్ లో చాలా అక్రమాలు చేశారని అంతా అన్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు, ఇళ్ల స్థలాల పంపిణీ విషయంలో అక్రమాలు జరిగాయని అంటున్నారు. ఈనేపథ్యంలో ఈసారి గంగులను ఓడించాలని ప్రజలు భావించినట్టు అంతా అనుకున్నారు.

కానీ.. ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది. నవంబర్ 30న మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ 40 శాతం మాత్రమే నమోదు అయింది. అయితే.. అప్పటికే సీన్ రివర్స్ అయిందని.. ఓడిపోయే పరిస్థితి ఉందని గుర్తించిన గంగుల వెంటనే మైనారిటీలు ఉన్న డివిజన్లలో డబ్బులు వెదజల్లినట్టు తెలుస్తోంది. ఒక్కో ఓటుకు 10 వేల చొప్పున పంపిణీ చేశారట. ఓవైపు పోలీసులు ఎన్నికల్లో విధుల్లో ఉండగా.. మరోవైపు గంగుల వర్గం మైనారిటీ వర్గాలను టార్గెట్ చేసి వాళ్ల ఓట్ల కోసం కోట్లు కుమ్మరించినట్టు తెలుస్తోంది. అలాగే.. మైనారిటీ పెద్దలకు కూడా వల వేసినట్టు తెలుస్తోంది. అందుకే చివరి మూడు గంటల్లో విపరీతమైన పోలింగ్ జరిగి అందరూ గంగులకు ఓటేశారు.

Bandi Sanjay : బండికే ఓట్లు వేసిన హిందువులు

హిందువులు ఎక్కువగా బండికి ఓటేస్తున్నారని తెలిసి మైనార్టీ వర్గానికి వల వేసి తెలివిగా తన వైపునకు తిప్పుకున్నారు గంగుల కమలాకర్. చివరకు గంపగుత్తగా మైనార్టీ ఓట్లు గంగులకు పడటంతో.. బండికి ఆ చివరి మూడు గంటల్లో తక్కువ ఓట్లు పడటంతో ఆయన ఓడిపోవాల్సి వచ్చింది.

Advertisement
WhatsApp Group Join Now

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది