CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి రామోజీరావుని కలవడానికి కారణం ఏంటి..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి రామోజీరావుని కలవడానికి కారణం ఏంటి..?

 Authored By tech | The Telugu News | Updated on :6 March 2024,10:00 am

ప్రధానాంశాలు:

  •  CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి రామోజీరావుని కలవడానికి కారణం ఏంటి..?

CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనాడు పత్రిక అధినేత రామోజీరావు ను కలిశారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి ఆయనను కలవడం వెనుక కారణం ఏముందా అని వివిధ రకాలుగా చర్చించుకుంటున్నారు. అయితే సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేసే శ్రేణులు వైసీపీ కి ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నాయి. ఇప్పుడు రండి సింహాన్ని పిలిపించారు రామోజీరావు ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి అని అంటున్నారు. ఇక ఇది వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి ఆడుతున్న డ్రామా అని వైసీపీ వర్గాలు అంటున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో ఉంటున్న రామోజీరావును కలవడం ఏపీ రాజకీయాలలో సంచలనంగా మారడం ఏంటని కొందరు భావిస్తున్నారు.

రామోజీరావు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారని అంటున్నారు. అయితే వీరిద్దరూ కలవడం పై వైసీపీ వారు ఒక రకంగా చర్చించుకుంటున్నారు. 2018లో కేసీఆర్ గెలిచాక 2019లో వైయస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి టీడీపీకి సంబంధించిన ఫినాన్సియల్ అన్నింటిని కట్ చేయించారని అలాగే జగన్మోహన్ రెడ్డి కి సంబంధించి ఫైనాన్షియల్ అన్నింటిని సరి చేశారని వైసీపీ వర్గాలలో రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇప్పుడు అదే విధంగా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో ఉన్న వైయస్ జగన్మోహన్ రెడ్డి ఫైనాన్షియల్ రెవెన్యూ లాంటివి కట్ చేయాలని చూస్తున్నారని అంటున్నారు. ఎలక్షన్స్ కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ నుంచి డబ్బు వస్తుంది. అలాగే ఎలక్షన్స్ కోసం చంద్రబాబుకి కూడా తెలంగాణ నుంచి డబ్బు వస్తుంది.

ఈ క్రమంలోనే వైయస్ జగన్మోహన్ రెడ్డికి డబ్బు వెళ్లకుండా ఆపేందుకు సీఎం రేవంత్ రెడ్డి చూస్తున్నారని అంటున్నారు. ఇక చంద్రబాబు నాయుడుకి తెలంగాణలో ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేస్తే అది ఆయనకు కలిసి వస్తుందని అందుకు సంబంధించిన లిస్టును రామోజీరావు సీఎం రేవంత్ రెడ్డికి కలిసి మరి ఇచ్చారని అంటున్నారు. అందుకే వీళ్ళు ఇంత సడన్గా కలిశారని వైసీపీ వాళ్లు అంటున్నారు. అయితే ఇది అంతా ఒక రూమర్ అని కొందరు అంటున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ వాళ్లు ఇది ఒక నార్మల్ మీటింగ్ అని దీనికి ఇంతలా భయపడుతున్నారంటే వైసీపీ ఓటమికి అంగీకరిస్తుందని అంటున్నారు . ఇది నిజంగా అలాంటి మీట్ అయితే డైరెక్ట్ గా ఎందుకు మీట్ అవుతారు అని ఇదంతా ఒక రూమర్ అని కొందరు భావిస్తున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

tech

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది