Crime News : పాల ప్యాకెట్ కోసం బయటికి వెళ్లిన యువతికి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా?
Crime News : ఓ యువతి పాల ప్యాకెట్ తీసుకురావడం కోసం బయటికి వెళ్లింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఈ ఘటన తెలంగాణలోని పటాన్ చెరులో చోటు చేసుకుంది. అసలు ఏం జరిగిందంటే.. సౌందర్య అనే 25 ఏళ్ల యువతి పటాన్ చెరు మండలం ఇంద్రేశం అనే గ్రామంలో నివసిస్తోంది. తనకు ఇంకా పెళ్లి కాలేదు. తన తండ్రి పేరు బుచ్చయ్య. వాళ్లకు సౌందర్య అనే ఒకే ఒక కూతురు జన్మించింది. తను పదో తరగతి వరకు మాత్రమే చదువుకుంది. ఆ తర్వాత చదువుకోలేదు. అప్పటి నుంచి ఇంట్లోనే ఉంటూ తన ఫ్యామిలీకి చేదోడు వాదోడుగా ఉంటోంది.

young girl missed in patan chervuvu while she went to bring milk
అయితే.. ఇటీవల ఒక రోజు ఆ యువతి పాల ప్యాకెట్ బయటికి వెళ్లింది. వెళ్లిన యువతి తిరిగి ఇంటికి రాలేదు. చాలా సేపు తమ కూతురు కోసం ఎదురు చూశారు కానీ.. ఎంతకీ ఆ యువతి తిరిగి రాలేదు. దీంతో ఆ యువతి కోసం తల్లిదండ్రులు చుట్టుపక్కన మొత్తం వెతికారు కానీ… ఆమె జాడ మాత్రం కనిపించలేదు. ఫోన్ కూడా చేశారు. ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది.
Crime News : పోలీసులకు ఫిర్యాదు చేసిన తండ్రి
దీంతో భయపడిపోయిన యువతి తండ్రి వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతి కోసం గాలిస్తున్నారు. ఉన్నట్టుండి తమ కూతురు కనిపించకపోవడంతో తల్లిదండ్రులకు ఏం చేయాలో అర్థం కాలేదు. వాళ్లు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటన ప్రస్తుతం పటాన్ చెరువు ప్రాంతంలో చర్చనీయాంశం అయింది. అసలు ఆ యువతి ఎక్కడికి వెళ్లింది అనేది ఎవ్వరికీ అర్థం కావడం లేదు.