YS Sharmila : తన గురించి పిచ్చ పిచ్చగా వాగే వాళ్లకి షర్మిల స్ట్రాంగ్ ఆన్సర్ ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YS Sharmila : తన గురించి పిచ్చ పిచ్చగా వాగే వాళ్లకి షర్మిల స్ట్రాంగ్ ఆన్సర్ !

 Authored By kranthi | The Telugu News | Updated on :24 June 2023,7:00 pm

YS Sharmila : వైఎస్ షర్మిల తెలుసు కదా. తను కేవలం వైఎస్సార్ బిడ్డ మాత్రమే కాదు. ఇప్పుడు తెలంగాణలో కీలకమైన రాజకీయ నాయకురాలు. వైఎస్సార్టీపీ పార్టీ అధ్యక్షురాలు. అయితే.. ప్రస్తుతం వైఎస్సార్టీపీ పార్టీ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈనేపథ్యంలో వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా దానిపై క్లారిటీ ఇచ్చారు. కాస్త ఘాటుగానే ఆమె ట్వీట్ చేశారు.

వైఎస్ షర్మిల రెడ్డి తన చివరి శ్వాస వరకు తెలంగాణ బిడ్డగానే ఉంటుంది. తెలంగాణ కోసమే పోరాడుతూ ఉంటుంది. తన లక్ష్యం కూడా అదే. ఊహాజనిత కథలు రాస్తూ.. కల్పిస్తూ.. నాకు, తెలంగాణ ప్రజల మధ్య ఒక అగాధాన్ని సృష్టించే విఫల ప్రయత్నాలు జరుగుతున్నాయి. అవన్నీ ఉత్తవే.. కల్పించినవే. పనిలేని వాళ్లు, పసలేని వాళ్లకు, దార్శనికులకు చెప్పేది ఒక్కటే. నా మీద దృష్టి పెట్టడం ఆపి.. నా రాజకీయ భవిత మీద పెట్టే దృష్టిని ఆపి.. ఆ సమయాన్ని కేసీఆర్ పాలనపై పెట్టండి.. అంటూ ట్వీట్ చేశారు.కేసీఆర్ సర్కారు పాలనలో సర్వనాశనమైపోతున్న తెలంగాణ భవిత మీద దృష్టి పెట్టండి. కేసీఆర్ కుటుంబ అవినీతిని ఎండగట్టండి. నా భవిష్యత్తు మొత్తం తెలంగాణలోనే ఉంటుంది.. తెలంగాణతోనే ఉంటుంది.

ys sharmila gives clarity on ysrtp party merge

ys sharmila gives clarity on ysrtp party merge

YS Sharmila : తెలంగాణ భవిత మీద దృష్టి పెట్టండి

నా ఆరాటం, పోరాటం అన్నీ తెలంగాణ కోసమే అంటూ వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసలు.. ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏంటో తెలుసా? కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపీని విలీనం చేయబోతున్నారని.. ఆ తర్వాత ఏపీలోనూ కాంగ్రెస్ పార్టీ కోసం షర్మిల పనిచేయబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. అంతే కాదు.. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ మాణిక్ రావు కూడా ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ షర్మిల గురించి వ్యాఖ్యలు చేయడంతో అందరూ వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో కలుపుతారని అనుకున్నారు. వాళ్లకు క్లారిటీ ఇవ్వడం కోసమే షర్మిల ఆ ట్వీట్ చేశారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది