YS Sharmila : బిగ్ బ్రేకింగ్‌.. కాంగ్రెస్ లోకి వైయస్ షర్మిల .. ఎక్క‌డ వాడుకుంటుందో అధిష్టానం.. ఏపీనా.. తెలంగాణ‌నా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YS Sharmila : బిగ్ బ్రేకింగ్‌.. కాంగ్రెస్ లోకి వైయస్ షర్మిల .. ఎక్క‌డ వాడుకుంటుందో అధిష్టానం.. ఏపీనా.. తెలంగాణ‌నా..?

 Authored By anusha | The Telugu News | Updated on :2 January 2024,4:05 pm

ప్రధానాంశాలు:

  •  YS Sharmila : కాంగ్రెస్ లోకి వై.యస్.షర్మిల .. జగన్ కు, చంద్రబాబుకు పెద్ద షాక్..!

YS Sharmila : ఆంధ్రప్రదేశ్ లో మరో వంద రోజుల్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు రానున్నాయి. దీంతో రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ప్రధాన పార్టీలు అయిన వైసీపీ, టీడీపీ, జనసేన అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో వార్త సంచలనంగా మారింది. వైయస్సార్ సీపి చీఫ్, సీఎం వై. ఎస్. జగన్మోహన్ రెడ్డి సోదరి వై.యస్.షర్మిల ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా బాధ్యతలు తీసుకుంటారని రాజకీయాలలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ కనుమరుగయింది. కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విజయంతో ఆంధ్ర ప్రదేశ్ పై దృష్టి పెట్టింది.

గతంలో పాలించిన రాష్ట్రంలో మళ్లీ యాక్టివ్ అయ్యేందుకు హైకమాండ్ దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేత దివంగత సీఎం వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి కూతురు వై.యస్.షర్మిల కు రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పజెప్పాలని కాంగ్రెస్ హై కమాండ్ ఆలోచిస్తుంది. షర్మిలకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే వై.ఎస్ పై ఉన్న సానుభూతి అభిమానం కలిసి వస్తాయని హై కమాండ్ ఆలోచన చేస్తుంది. అయితే మరో రెండు మూడు రోజుల్లో షర్మిలను ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా డిక్లేర్ చేస్తూ ఏఐసీసీ నుండి అధికారిక ప్రకటన రాబోతున్నట్లు టాక్. ఈ క్రమంలోనే వై.యస్.షర్మిల ఢిల్లీ పర్యటన ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఈనెల నాలుగవ తేదీన వైయస్ షర్మిల ఢిల్లీకి వెళ్తున్నారని సమాచారం అదే రోజు వైయస్సార్ టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి

కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సమక్షంలో షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఆమెతోపాటు మరో 40 మంది నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు టాక్. కాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో షర్మిల వైయస్సార్ టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలని ప్రయత్నం చేశారు. కానీ తెలంగాణ కాంగ్రెస్లోని ఓవర్గం షర్మిల ఎంట్రీ ని అడ్డుకోవడంతో ఆవిలీనం ఆగిపోయింది. అయినప్పటికీ షర్మిల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా కాంగ్రెస్ కు మద్దతు తెలిపారు. అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం షర్మిలకు కీలక పదవి ఇస్తారని వార్తలు వినిపించాయి. కానీ ఏపీలో మరికొన్ని నెలల్లో ఎన్నికలు ఉండడంతో హై కమాండ్ అక్కడ షర్మిలను వినియోగించుకోవాలని ప్లాన్ చేస్తుంది.

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది