YS Sharmila : సోనియాతో వైఎస్ షర్మిల భేటీ? వైఎస్సార్టీపీ విలీనం ఖాయమా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YS Sharmila : సోనియాతో వైఎస్ షర్మిల భేటీ? వైఎస్సార్టీపీ విలీనం ఖాయమా?

 Authored By kranthi | The Telugu News | Updated on :1 September 2023,5:00 pm

YS Sharmila : ప్రస్తుతం వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈనేపథ్యంలో ఆమె కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ అయినట్టు తెలుస్తోంది. వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరిక అధికారం కానుంది ఇక. తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. వైఎస్సార్టీపీ పార్టీని పార్టీలో విలీనం, పార్టీలో తన పాత్ర పైన వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల ముఖ్య నేతలతో చర్చలు జరిపారు. షర్మిలను పార్టీపై ఆహ్వానం, విలీనంపై కేసీ వేణుగోపాల్, డీకే శివకుమార్ కూడా చర్చలు జరిపారు. అయితే తొలి నుంచి తెలంగాణకే పరిమితం అవుతానని షర్మిల చెప్పుకుంటూ వచ్చారు. కానీ.. రేవంత్ రెడ్డితో పాటు మరికొందరు నేతలు మాత్రం అభ్యంతరం వ్యక్తం చేశారు.

వైఎస్సార్ తో కలిసి పని చేసిన కొందరు సీనియర్ నేతలు మాత్రం షర్మిలకు మద్దతుగా నిలిచారు. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో మరింత ఆలస్యం చేయకుండా ముందుగా షర్మిలను పార్టీలో చేర్చుకోవాలని, రెండు తెలుగు రాష్ట్రాల్లో షర్మిల సేవలను వినియోగించుకోవాలని కాంగ్రెస్ అధినాయకత్వం డిసైడ్ అయినట్టు సమాచారం. ఈ ప్రతిపాదనకు షర్మిల కూడా అంగీకరించారట. ఏపీలోనూ షర్మిల పార్టీ బాధ్యతలు తీసుకోవాలని కాంగ్రెస్ హైకమాండ్ షర్మిలకు చెప్పనుందట. షర్మిల మాత్రం పాలేరు నుంచి పోటీ చేసేందుకు సుముఖత చూపిస్తున్నా.. కర్ణాటక నుంచి తనకు రాజ్య సభ సీటు ఇచ్చేందుకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ys sharmila meets Sonia Gandhi in Delhi

YS Sharmila : సోనియాతో వైఎస్ షర్మిల భేటీ? వైఎస్సార్టీపీ విలీనం ఖాయమా?

YS Sharmila : తన భర్త అనీల్ తో కలిసి సోనియాను కలిసిన షర్మిల

తన భర్త అనీల్ తో కలిసి షర్మిల సోనియా గాంధీని కలిశారు. అయితే.. వాళ్లు ఏం మాట్లాడుకున్నారో తెలియదు కానీ.. సెప్టెంబర్ 2న తన తండ్రి వైఎస్సార్ వర్ధంతి నాడు తన రాజకీయ భవిష్యత్తు, వైఎస్సార్టీపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలో తన ప్రయాణం గురించి అందరికీ వెల్లడించనున్నట్టు తెలుస్తోంది. అయితే.. ఏపీలో పార్టీ బాధ్యతలను షర్మిలకే అప్పగించాలని హైకమాండ్ భావిస్తోంది. తన అన్న జగన్ కు వ్యతిరేకంగా ఏపీలో షర్మిలను దించి వచ్చే ఎన్నికల్లో షర్మిలను కడప ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దింపాలనేది కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచనగా ఉంది. చూద్దాం.. ఏం జరుగుతుందో, షర్మిల తన రాజకీయ భవిష్యత్తుపై ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది