YS Sharmila : నేను పోటీ చేయడం లేదు.. పాలేరులో పొంగులేటికి మద్దతు ఇస్తున్నా.. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నా.. షాకిచ్చిన వైఎస్ షర్మిల | The Telugu News

YS Sharmila : నేను పోటీ చేయడం లేదు.. పాలేరులో పొంగులేటికి మద్దతు ఇస్తున్నా.. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నా.. షాకిచ్చిన వైఎస్ షర్మిల

YS Sharmila : అనుకున్నట్టుగానే వైఎస్ షర్మిల తెలంగాణ ప్రజలకు, పాలేరు ప్రజలకు షాకిచ్చారు. చాలా రోజుల నుంచి కంటిన్యూ అవుతున్న సస్పెన్స్ కు నేడు ముగింపు పలికారు వైఎస్ షర్మిల. తెలంగాణలో పోటీ చేయడం లేదని.. ఈసారి వైఎస్సార్టీపీ పోటీ నుంచి తప్పుకొని కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తోందని తాజాగా ప్రకటించారు. వైఎస్ షర్మిల ఈసారి పోటీ చేయకుండా, తమను పోటీ చేయనీయకుండా మోసం చేశారని.. వైఎస్సార్టీపీ నాయకులు ఆ పార్టీ కార్యాలయంలో ధర్నా నిర్వహించిన […]

 Authored By kranthi | The Telugu News | Updated on :3 November 2023,1:06 pm

ప్రధానాంశాలు:

  •  వైఎస్ షర్మిల సంచ‌ల‌న నిర్ణ‌యం.. ఎన్నిక‌ల్లో వైఎస్సార్టీపీ పోటీకి దూరం..!

  •  పాలేరు నుంచి తప్పుకుంటున్నా

  •  కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నా

YS Sharmila : అనుకున్నట్టుగానే వైఎస్ షర్మిల తెలంగాణ ప్రజలకు, పాలేరు ప్రజలకు షాకిచ్చారు. చాలా రోజుల నుంచి కంటిన్యూ అవుతున్న సస్పెన్స్ కు నేడు ముగింపు పలికారు వైఎస్ షర్మిల. తెలంగాణలో పోటీ చేయడం లేదని.. ఈసారి వైఎస్సార్టీపీ పోటీ నుంచి తప్పుకొని కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తోందని తాజాగా ప్రకటించారు. వైఎస్ షర్మిల ఈసారి పోటీ చేయకుండా, తమను పోటీ చేయనీయకుండా మోసం చేశారని.. వైఎస్సార్టీపీ నాయకులు ఆ పార్టీ కార్యాలయంలో ధర్నా నిర్వహించిన విషయం తెలిసిందే. దీంతో వెంటనే తమ నేతలతో సమీక్ష నిర్వహించిన వైఎస్ షర్మిల తాజాగా ఈ ప్రకటన చేశారు. తెలంగాణలో పోటీ నుంచి తప్పుకొని కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నా. పాలేరులో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మద్దతు ఇస్తున్నా అంటూ వైఎస్ షర్మిల ప్రకటించారు.

మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావద్దు కాబట్టే కాంగ్రెస్ కు ఒక అవకాశం ఇవ్వడం కరెక్ట్ అనిపిస్తోంది. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తోంది వైఎస్సార్ తెలంగాణ పార్టీ. పాలేరు ప్రజలు నాకు సమాధానం చెప్పాలి. నన్నేం చేయమంటారు. మొండిగా తెగించి నిలబడమంటారా? పొంగులేటిని ఓడించమంటారా? నన్ను ఓడిపోమంటారా? రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు ఏం కోరుకుంటున్నారు? గెలుపు ముఖ్యమే, గెలుపు గొప్పదే. కానీ.. త్యాగం అంతకంటే గొప్పది. రాజశేఖర్ రెడ్డి బిడ్డను అర్థం చేసుకుంటారని పాలేరు ప్రజలను మనస్ఫూర్తిగా కోరుతోంది రాజశేఖర్ బిడ్డ. ఎప్పటికైనా పాలేరు ప్రజలతో ఓటు వేయించుకుంటా. ఎప్పటికైనా పాలేరు ప్రజలను నేను రిప్రజెంట్ చేయాలనేది నా కోరిక అంటూ షర్మిల కంటతడి పెట్టుకున్నారు.

kranthi

డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక

Polls

తెలంగాణ‌లో కాంగ్రెస్ వ‌స్తే ఎవ‌రిని సీఎం చేసే అవ‌కాశం ఉంది..?

View Results

Loading ... Loading ...