Anee Master : అంత రెమ్యునరేషనా.. యానీ మాస్టర్ రేంజ్ అదే మరి.. ?

Authored By mallesh | The Telugu News | Published on: November 23, 2021, 6:40 pm

Anee Master : తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్ సీజన్ ఫైవ్’ కంటెస్టెంట్‌గా పార్టిసిపేట్ చేసి ప్రేక్షకుల మనసు దోచుకున్న యానీ మాస్టర్ ఇటీవల షో నుంచి ఎలిమినేట్ అయింది. అయితే, హౌస్‌లో ఉన్నంతసేపు యానీ మాస్టర్ గేమ్, టాస్కులపైనే ఫోకస్ పెట్టిదని చెప్పొచ్చు. కొన్ని విషయాల్లో మాత్రం యానీ మాస్టర్ మిగతా కంటెస్టెంట్స్‌పైన అరిచేసింది. చివరకు ఆమెనే ఎలిమినేట్ అయింది.బిగ్ బాస్ సీజన్ ఫైవ్’ టైటిల్ గెలుచుకునేందుకుగాను విశ్వ ప్రయత్నాలు చేసింది యానీ మాస్టర్. యానీ డెఫినెట్‌గా టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్‌లో ఒకరుగా ఉంటుందని అందరూ అనుకున్నారు.

Anee Master : యానీ మాస్టర్‌కు గ్రాండ్ వెల్ కమ్ చెప్పిన ఫ్రెండ్స్..

anee master do you know the remuneration of yani master iin big boss


anee master do you know the remuneration of yani master iin big boss

కానీ, యానీ మాస్టర్ చివరకు ఎలిమినేట్ అయిపోయింది. గేమ్ ఆడే సమయంలో యానీ మాస్టర్ రకరకాల స్ట్రాటజీలు వేసుకుంది. ఇకపోతే హౌస్ నుంచి ఎలిమినేట్ అయి వచ్చిన యానీ మాస్టర్‌కు ఫ్రెండ్స్ గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు. టాలీవుడ్ స్టార్ హీరోలు పవన్ కల్యాణ్, రవితేజ ఇతరులకు డ్యాన్స్ కొరియోగ్రఫీ చేసిన యానీ మాస్టర్ మొత్తంగా బిగ్ బాస్ హౌస్‌లో సూపర్బ్‌గా ఫర్ఫార్మ్ చేసిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.బిగ్ బాస్ హౌస్‌లో తాను డ్యాన్స్ చేసినపుడు.మిగతా కంటెస్టెంట్స్ చులకన చేయడం పట్ల యానీ మాస్టర్ ఫుల్ ఫైర్ అయింది.

ఈ సంగతి అలా ఉంచితే.. యానీ మాస్టర్ పదకొండు వారాల పాటు హౌస్‌లో ఉంది.. కాగా, ఇన్ని రోజులకుగాను యానీ మాస్టర్‌కు మైండ్ బ్లోయింగ్ రెమ్యునరేషన్ ఇచ్చినట్లు వార్తలొస్తున్నాయి. ‘బిగ్ బాస్’ నిర్వాహకులు యానీ మాస్టర్‌కు వారానికి రూ.3 లక్షల రెమ్యునరేషన్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆ లెక్కన యానీ మాస్టర్‌కు ఈ సీజన్ ఫైల్ పాల్గొన్నందుకుగాను రూ.35 లక్షలకు పైనే రెమ్యునరేషన్ అందినట్లు పేర్కొంటున్నారు. ఈ విషయం తెలుసుకుని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. షో లో పార్టిసిపేట్ చేసి యానీ మాస్టర్ ఫేమ్ ప్లస్ మనీ రెండూ సంపాదించుకుందని అభిప్రాయపడుతున్నారు.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp