Hyderabad : భారీ వర్షం వల్ల నడిరోడ్డుపై నీట మునిగిన కారు.. ఎక్కడంటే?
Hyderabad : హైదరాబాద్ సిటీని విశ్వనగరంగా మారుస్తామని పాలకులు ఓ వైపు చెప్తున్నారు. మరో వైపు చిన్న పాటి వర్షానికే నగరం అతలాకుతలం అవుతున్నది. భారీ వర్షం కురుస్తే ఇక అంతే సంగతులు అన్నట్లుగా ఉంది పరిస్థితి. బాగా వాన పడితే వాహనాలు గంటల తరబడి రోడ్లపైన ఉండాల్సిన సిచ్యువేషన్స్ ఉన్నాయి.
తాజాగా హైదరాబాద్‌లో కురిసిన వర్షానికి అత్తాపూర్‌లో నడిరోడ్డుపైన కారు నీట మునిగింది. దాంతో అత్తాపూర్ ఏరియాలో ట్రాఫిక్ జామ్ అయింది. ఎంత ప్రయత్నించినప్పటికీ కారు నీటి నుంచి బయటకు రావడం లేదు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. వీడియో చూసి నెటిజన్లు సీఎం కేసీఆర్ కాంక్షించిన బంగారు తెలంగాణ ఇదేనా? అని ప్రశ్నిస్తున్నారు.
మరి కొందరు నెటిజన్లు అయితే తెలంగాణ ప్రభుత్వం డెవలప్ చేస్తున్నా ఇస్తాంబుల్ లేదా డల్లాస్ ఇదేనా అని అడుగుతున్నారు. వర్షం వల్ల రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. వైరలవుతున్న సదరు వీడియోలో అత్తాపూర్‌లో నడిరోడ్డుపైన కొలను ఉన్న మాదిరిగా నీళ్లు నిలిచిపోయి ఉన్నాయి.
A car was submerged in rain water at Attapur after heavy rain in Hyderabad on Friday evening. pic.twitter.com/zVhKxNUDBJ
— TNIE Telangana (@XpressHyderabad) October 8, 2021