Kodali Nani : కొడాలి నానిని దెబ్బ కొట్టటానికి బాబు భారీ స్కెచ్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Kodali Nani : కొడాలి నానిని దెబ్బ కొట్టటానికి బాబు భారీ స్కెచ్..!

 Authored By brahma | The Telugu News | Updated on :9 October 2021,1:04 pm

kodali nani  : టీడీపీ అధినేత చంద్రబాబు మీద ఆయన తనయుడు లోకేష్ మీద ఒంటి కాలు మీద లేచే నేతగా మంత్రి కొడాలి నానికి పేరు ఉంది.. జగన్ మీద చిన్న విమర్శా వచ్చిన కానీ, తండ్రి కొడుకుల మీద దారుణమైన విమర్శలు చేయటానికి వెనకాడని నాని అంటే టీడీపీ నేతలకు పీకలదాకా కోపం ఉంటుంది. పైగా గుడివాడ లో వరస విజయాలతో నాని దూసుకొని పోతూ తిరుగులేని నేతగా చెలామణి అవుతున్నాడు. అతని దూకుడుకు అడ్డుకట్ట వేయాలంటే ఖచ్చితంగా గుడివాడలో ఓడించటం ఒక్కటే మార్గమని బాబు భావించినట్లు తెలుస్తుంది.

Kodali Nani tears into Chandrababu Naidu on free power

Kodali Nani tears into Chandrababu Naidu on free power

 

అయితే అక్కడ టీడీపీకి బలమైన క్యాండెట్ లేరు. 2004 2009 ఎన్నికల్లో టీడీపీ నుంచి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యే అయిన నాని.. ఆ తర్వాత వైసీపీలోకి జంప్ చేసేశారు. 2014 ఎన్నికల్లో ఏపీలో వైసీపీ ఓడిపోయినా కూడా గుడివాడలో వరుసగా మూడో సారి గెలిచి హ్యాట్రిక్ కొట్టడంతో పాటు తన కంచుకోట అని ఫ్రూవ్ చేసుకున్నాడు. ఇక మొన్న ఎన్నికల్లో వరుసగా నాలుగోసారి విజయం సాధించి.. గుడివాడలో తనను కొట్టేవారే లేడని ఫ్రూవ్ చేసుకున్నాడు.

Kodali Nani vs chandrababu naidu

Kodali Nani vs chandrababu naidu

నానిని ఢీ కొట్టటానికి పోటీగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతను బాబు పోటీలో నిలబెట్టేవాడు, కానీ ఆ వ్యూహం అనుకున్న ఫలితాన్ని ఇవ్వటం లేదు. దీనితో ఈ సరి కాపు సామాజిక వర్గానికి చెందిన నేతను దించాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. గుడివాడ లో కాపు సామాజిక వర్గం ఓట్లు భారీగానే ఉన్నాయి. దీనితో కాపులు రాజకీయ ఆరాధ్య దేవుడుగా భావించే వంగవీటి మోహన్ రంగా కొడుకు వంగవీటి రాధను అక్కడ బరిలో దించాలని బాబు భావించి, అందుకు తగ్గట్లు వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. అదే కనుక జరిగితే కొడాలి నానికి గట్టి పోటీ ఎదురుకావటం ఖాయమే అని తెలుస్తుంది. దీనికి తోడు కాపుల్లో కూడా కొత్త ఉత్సహం వచ్చే అవకాశం ఉంది… మరి చంద్రబాబు వ్యూహం ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి..

 

brahma

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది