Huzurabad : దేశంలోనే కాస్ట్‌లీ ఉప ఎన్నిక.. హుజురాబాద్‌లో ఓటు విలువ ఎంతంటే?
Huzurabad : మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజురాబాద్ ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఉప ఎన్నిక ఈ నెల 30న జరగనుండగా ప్రస్తుతం ఎన్నికల ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ బై పోల్ దేశంలోనే కాస్ట్‌లీ బై పోల్ అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. బీజేపీ తరఫున ఈటల రాజేందర్ ప్రచారం చేస్తుండగా, అధికార టీఆర్ఎస్ పార్టీ తరఫున గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు మద్దతుగా మంత్రి హరీశ్‌రావు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు […]
Huzurabad : మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజురాబాద్ ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఉప ఎన్నిక ఈ నెల 30న జరగనుండగా ప్రస్తుతం ఎన్నికల ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ బై పోల్ దేశంలోనే కాస్ట్‌లీ బై పోల్ అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. బీజేపీ తరఫున ఈటల రాజేందర్ ప్రచారం చేస్తుండగా, అధికార టీఆర్ఎస్ పార్టీ తరఫున గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు మద్దతుగా మంత్రి హరీశ్‌రావు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రచారం చేస్తున్నారు. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్ తరఫున కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారు. అయితే, ఈ నియోజకవర్గంలో ప్రధానమైన పోటీ బీజేపీ, టీఆర్ఎస్ మధ్యే అని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
Huzurabad : రూ.వేలల్లో ఓటు విలువ..?
ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవాలని ప్రధాన పార్టీలైన బీజేపీ, టీఆర్ఎస్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రతీ ఓటరు వద్దకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్క ఓటుకు రూ.10 నుంచి రూ.15 వేల వరకు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఒక ఫ్యామిలీలో 10 కంటే ఎక్కువ మంది ఓటర్స్ ఉంటే డైరెక్ట్‌గా రూ.3 లక్షలు ఇచ్చేస్తున్నారట. ఈ క్రమంలోనే గ్రామాల్లో ఉన్న ముఖ్యమైన సమస్యలను వెంటనే పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారని వినికిడి. దుబ్బాక, నాగార్జున సాగర్ కంటే కూడా ఈ బై పోల్ వెరీ కాస్ట్‌లీ అని కొందరు రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
హుజురాబాద్ మండలంలోని ఓ గ్రామానికి ఉప ఎన్నిక సందర్భంగా వెంటనే రోడ్డు పడటం విశేషమనే చెప్పొచ్చు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకుగాను ముందే పార్టీ కార్యకర్తలు ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక డబ్బు పంపిణీపై బీజేపీ, టీఆర్ఎస్ నేతలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ ఒక్క ఓటుకు రూ.20 వేలు ఇస్తున్నదని విమర్శిస్తున్నారు. కాగా, బీజేపీ అభ్యర్థి ఈటల ఇప్పటికే ప్రతీ ఇంటికి వాల్ వాచెస్ ఇచ్చారని, దాంతో పాటు ఓట్లు కూడా కొనాలని ప్లాన్ చేస్తున్నారని గులాబీ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. హుజురాబాద్ బై పోల్‌ను రెండు పార్టీలు చాలా సీరియస్ గా తీసుకున్నాయని అందరికీ అర్థం అవుతున్నది. తెలంగాణ ప్రజానీకం అంత కూడా హుజురాబాద్ ఉప ఎన్నికలో ఎవరు గెలుస్తారో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.